BigTV English

NASA:ఇజ్రాయెల్‌కు సాయంగా నిలబడిన అమెరికా..

NASA:ఇజ్రాయెల్‌కు సాయంగా నిలబడిన అమెరికా..

NASA:కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు.. తమతో పాటు ఇతర దేశాలకు సాయం చేయడానికి కూడా ముందుకొస్తాయి. ఇలాంటివి ఎక్కువగా స్పేస్ విభాగంలోనే జరుగుతాయి. స్పేస్‌పై పరిశోధనలు చేయాలని చాలా దేశాల పరిశోధకులకు ఉంటుంది. కానీ వనరులు మాత్రం కొన్ని దేశాల దగ్గరే ఉంటాయి. అలాంటప్పుడు ఆ రెండు దేశాలు కలిసి ముందుకెళ్తాయి. ఇప్పుడు అమెరికా కూడా ఇజ్రాయెల్‌కు ఇదే విధంగా సహాయపడుతోంది.


ఇజ్రాయెల్.. తన తొలి టెలిస్కోప్ మిషిన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమయ్యింది. అల్ట్రాసాట్ పేరుతో తయారైన మిషిన్‌ను నాసా లాంచ్ చేయనుంది. 2026 మొదట్లో ఈ మిషిన్ ఆకాశంలోకి ఎగరనుంది. ఈ పార్ట్‌నర్‌షిప్ అనేది తమకు చాలా సంతోషకరంగా ఉందని నాసా ప్రకటించింది. అల్ట్రాసాట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలకు ఉపయోగపడే సమాచారాన్ని స్పేస్ నుండి పంపిస్తుందని నాసా తెలిపింది.

మాములు మోతాదుకంటే పెద్ద వ్యూతో అల్ట్రాసాట్ డిజైన్ చేయబడుతుంది. న్యూట్రన్ స్టార్స్, సూవర్‌నోవా వంటి ప్రక్రియలను దగ్గర నుండి గమనించడానికి అల్ట్రాసాట్ ఉపయోగపడుతుంది. అలాంటి ప్రక్రియల నుండి వెలువడే అల్ట్రావైలెట్ లైట్‌ను గమనించడానికి అల్ట్రాసాట్ పనిచేస్తుంది. అంతే కాకుండా మరెంత అధునాతనమైన టెక్నాలజీతో అల్ట్రాసాట్ తయారు చేయబడుతుందని నాసా బయటపెట్టింది.


ఇజ్రాయెల్ స్పేస్ ఇండస్ట్రీ కూడా ఇప్పటికీ స్పేస్‌పై ఎన్నో పరిశోధనలు చేసి విజయం సాధించింది. ఇక ప్రత్యేకంగా అల్ట్రాసాట్ ప్రాజెక్ట్ కోసం ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీకి నాసా సాయం అందించడం విశేషం. ప్రస్తుతం నాసాకు, ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీకి జరిగిన ఒప్పందం ప్రకారం నాసా లాంచ్ సర్వీస్‌ను, ఫ్లైట్ పోలోడ్ అడాప్టర్‌ను, లాంచ్‌కు సంబంధించిన ఇతర సర్వీసులను ఇజ్రాయెల్‌కు అందించడానికి సిద్ధంగా ఉంది.

Human Body:మనిషి శరీరంలోకి వెళ్లగలిగే రోబో..

Glaucoma:అంతుచిక్కని వ్యాధుల్లో ఒకటి.. గ్లాకోమా..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×