Samsung TV: ఈ మధ్య కాలంలో టెక్నాలజీ మన జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలతో ఇంట్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడడమో, వార్తలు వినడమో, సంగీతం ఆస్వాదించడమో చాలా సులభం అయిపోయింది. కానీ ఒక్కసారిగా అవి పనిచేయకపోతే..? అదే పరిస్థితిని ఇప్పుడు అమెరికాలోని వేలాది సామ్సంగ్ టీవీ యూజర్లు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకుని మీరు కూడా షాక్ అవుతారు.
అమెరికాలోని వేలాది మంది సామ్సంగ్ స్మార్ట్ టీవీ యూజర్లకు జూలై 31 మధ్యాహ్నం నుంచి టీవీ యాప్‌లు పనిచేయకపోవడం షాక్ కి గురిచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, పీకాక్, యూట్యూబ్ TV లాంటి ప్రధానమైన స్ట్రీమింగ్ యాప్‌లు ఓపెన్ కాక, టీవీ తిరిగి తిరిగి “టర్మ్స్ అండ్ కండిషన్స్” స్క్రీన్‌కి వెళ్లిపోతోంది. ఎన్నిసార్లు అంగీకరించాల్సిన అవసరం లేకపోయినా, ఆ స్క్రీన్ నుంచి బయటకు రావడం చాలా మందికి సాధ్యపడలేదని వారు తెలిపారు.
ఇప్పటి వరకు 2,000 మందికిపైగా ఈ సమస్యను డౌన్డిటెక్టర్ అనే వెబ్‌సైట్‌లో నివేదించారు. అంటే ఇది చిన్నపాటి సమస్య కాదు, దేశవ్యాప్తంగా విస్తరించిన బిగ్ టెక్నికల్ ఫెయిల్యూర్. కొన్ని కుటుంబాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. పాత టీవీ పాడైందనుకుని కొందరు కొత్త టీవీలు కొన్నారు. కానీ కొత్త సామ్సంగ్ టీవీల్లో కూడా అదే సమస్య రావడంతో వాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఓ యూజర్ సోషల్ మీడియాలో ఇలా రాశారు – “సేవర్ డౌన్ అయిందని తెలుసుకోక ముందే, ఐదేళ్ల పాత టీవీ తీసేసి కొత్త 2025 మోడల్ కొనేశాను. కానీ సమస్య అదే. రాత్రంతా డిప్రెషన్‌లో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
వీటిపై సామ్సంగ్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. బదులుగా, సోషల్ మీడియాలో వ్యక్తిగత మెసేజ్‌ల ద్వారా ఒక్కొక్కరికి సపోర్ట్ ఇవ్వాలని చూస్తోంది. దీంతో ప్రజల్లో అసహనం పెరుగుతోంది. సాధారణంగా ఇలాంటి సమస్యలు సర్వర్ సైడ్ లోపాల వల్ల వస్తాయి. యాప్‌లు పని చేయాలంటే టీవీ కంపెనీ సర్వర్లతో కనెక్షన్ అవసరం. ఆ సర్వర్ డౌన్ అయితే, టీవీ కూడా పని చేయదు. కానీ ఈ విషయం తెలిసేలోపే కొంతమంది కొత్త టీవీలు కొన్నారంటే, వారి నష్టం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
ప్రస్తుతం అమెరికాలోని వేలాది టీవీలు పనిచేయకపోవడం సామ్సంగ్ బ్రాండ్‌పై నమ్మకాన్ని బలహీనపరుస్తోంది. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందన్నది ఇంకా తెలియలేదు. అప్డేట్ వస్తుందా, లేక సర్వర్ రీసెట్ అవుతుందా అన్నది తెలియక తడబడుతున్నారు. బ్రాండ్ పెద్దదైనా, ప్రజలతో స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం చాలా అవసరం. ఈ సమయంలో మీరు చేయాల్సిందేమంటే – టీవీ లోపమేమీ అనుకోకుండా, కొద్దిసేపు వేచి ఉండాలి. కొత్త టీవీ కొనాలని తొందరపడకండి. ఒకటి సారిగా సామ్సంగ్ నుంచి క్లారిటీ వచ్చే వరకు తగినంత శాంతంగా ఉండండి. ఇంకోసారి ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా బ్రాండ్‌లు ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటే, వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే మార్గం.
టెక్నాలజీ మన జీవితం సులభం చేస్తోంది అనుకోవచ్చు. కానీ అది పనిచేయకపోతే మనం ఎంత డిపెండెంట్ అయిపోయామో అర్థమవుతోంది. సామ్సంగ్ ఇప్పటికైనా ఈ సమస్యపై ఓ క్లారిటీ ఇవ్వాలి. లేదంటే యూజర్లు బ్రాండ్ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతారు. మీకూ ఇలాంటి సమస్య ఎదురైతే, టీవీ మార్చకండి. ఒక్కసారి కంపెనీ అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయండి.