Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor)బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఈయన నటించిన సినిమాలన్నీ ఇటీవల కాలంలో తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. రణబీర్ నటించిన బ్రహ్మాస్త్రం, యానిమల్ సినిమాలు ఇక్కడ కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం రణబీర్ కపూర్ నితీష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో రామాయణ సినిమా(Ramayana Movie)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి భాగం 2026 దీపావళి పండుగను పురస్కరించుకొని విడుదల కాబోతున్నట్లు తెలియజేశారు.
రాముని పాత్రలో రణబీర్ కపూర్..
ఇక రెండవ భాగం కూడా 2027 దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటించగా సాయి పల్లవి(Sai Pallavi) సీత పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా రణబీర్ కపూర్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈయన రామాయణ సినిమా కోసం ఓ బయోపిక్ సినిమాని వదులుకున్నారని తెలుస్తోంది. రామాయణ కంటే ముందుగానే రణబీర్ కపూర్ కిషోర్ కుమార్ బయోపిక్(Kishore Kumar Biopic) సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
కిషోర్ కుమార్ బయోపిక్…
దర్శకుడు అనురాగ్ బసు(Anurag Basu) ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ.. తన దర్శకత్వంలో రణబీర్ కపూర్ కిషోర్ కుమార్ బయోపిక్ సినిమా చేయాలని భావించాము అయితే కొన్ని కారణాల వల్ల ఇది ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఆ సమయంలోనే నితేష్ తివారి రామాయణం గురించి చెప్పడంతో రణబీర్ కపూర్ కిషోర్ కుమార్ బయోపిక్ సినిమాని వదులుకొని రామాయణ సినిమాకు కమిట్ అయ్యారని అనురాగ్ బసు తెలిపారు. రణబీర్ రామాయణ చేయాలని తీసుకున్న నిర్ణయం కఠినమైనది అయినప్పటికీ ఇది సరైన నిర్ణయమే అంటూ అనురాగ్ తెలియజేశారు.
అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా…
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రామాయణ రెండు భాగాలు అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సుమారు నాలుగువేల కోట్లతో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక గ్లింప్ వీడియో విడుదల చేయగా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో పలు విమర్శలు వచ్చాయి అయితే ఈ విమర్శలకు చిత్ర బృందం చెక్ పెట్టారు రణబీర్ కపూర్ మొహం ఎల్లప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అందుకే తనని రాముడి పాత్రకు ఎంపిక చేసామని తెలియజేశారు. ఇక సీతగా సాయి పల్లవి నటించగా, రావణాసురుడి పాత్రలో కన్నడ స్టార్ యష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
Also Read: OG First Single: పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు షాకింగ్ న్యూస్.. లీకైన ఓజీ ఫస్ట్ సింగిల్!