E-Paper
Advertisement

Aa Okkati Adakku OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన అల్లరోడి ‘ఆ ఒక్కటి అడక్కు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Aa Okkati Adakku OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన అల్లరోడి ‘ఆ ఒక్కటి అడక్కు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Advertisement

AA Okkati Adakku movie ott release date(Telugu film news): ఒకప్పుడు టాలీవుడ్‌లో కడుపుబ్బా నవ్వించే సినిమాలు ఏవైనా ఉన్నాయంటే అవి అల్లరి నరేష్ సినిమాలే. దీన్ని ఎవరూ కొట్టిపారేయలేరు. కానీ కాల క్రమేనా.. అతడి సినిమాలకు డిమాండ్ బాగా తగ్గిపోయింది. ఇప్పటి ఆడియన్స్ మాస్ మసాలా సినిమాలను కోరుకుంటున్నారు. అయితే నరేష్ తన కామెడీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ప్రస్తుతం మాస్ యాక్షన్ సినిమాలపైనే ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగానే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.

ఇందులో భాగంగానే నాంది, ఉగ్రం వంటి ఫుల్ మాస్ యాక్షన్ సినిమాలు చేశాడు. అయినా బాక్సాఫీసు వద్ద అంత ప్రభావం చూపించలేకపోయాడు. ఇప్పటి వరకు యాక్షన్ జోనర్‌లో వచ్చినా పెద్దగా ఫలితం లేదని తెలిసి.. ఇటీవల అతడు కామెడీ జోనర్‌లో మరొక కొత్త సినిమాతో వచ్చాడు. మల్లి అంకం దర్శకత్వంలో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు.

Advertisement

ఈ చిత్రాన్ని రాజీవ్ చిలక నిర్మించారు. అయితే ఇందులో అల్లరి నరేష్‌కు జోడీగా టాల్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. అలాగే వెన్నెల కిషోర్, వైవా హర్ష, వంటి నటులు ఇందులో కీలక పాత్ర పోషించారు. ఇక ఎన్నో అంచనాలతో మే 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది. అంతేకాకుండా రెండు మూడు రోజుల్లో మంచి వసూళ్లు రాబట్టినా.. ఆ తర్వాత మాత్రం తన హవా చూపించలేకపోయింది. దీంతో ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది.

Also Read: అల్లరి నరేష్ మరో కొత్త అవతారం.. ఈసారి మోత మోగిపోవాల్సిందే..!

Advertisement

ఎవరికీ చెప్పకుండానే.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఎంచెక్కా ఓటీటీలో చూసేయొచ్చు. ఇకపోతే విజయపజయాలతో సంబంధం లేకుండా అల్లరి నరేష్ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు మరొక మాస్ యాక్షన్ సినిమాతో వస్తున్నాడు. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో ‘బచ్చల మల్లి’ మూవీ చేస్తున్నాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×