BigTV English

Westindies won by 35 runs in Australia: టీ20 టోర్నీకి ముందు, ఆసీస్‌ను కంగారెత్తించిన విండీస్ ఆటగాళ్లు

Westindies won by 35 runs in Australia: టీ20 టోర్నీకి ముందు, ఆసీస్‌ను కంగారెత్తించిన విండీస్ ఆటగాళ్లు

West Indies vs Australia match highlights(Sports news today): టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. పోర్టు ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పూరన్, పావెల్, రూథర్‌ఫర్డ్ విశ్వరూపం చూపారు. ఫలితం ఆసీస్ ఆటగాళ్లు కంగారు పడ్డారు.


పోర్టు ఆఫ్ స్పెయిన్ వేదికగా విండీస్-ఆసీస్‌ల మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా, ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా హోప్-జాన్షన్ బరిలోకి దిగారు. దూకుడుగా ఆడే క్రమంలో హోప్ తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన పూరన్, జాన్షన్‌తో జత కలిశాడు. వీరిద్దరు ఆసీస్ బౌలర్లను చీల్చిచెండాడారు.

పూరన్ తనదైనశైలిలో చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 75 పరుగులు చేశాడు. అందులో ఫోర్ల కంటే సిక్స్‌లు ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రతీ బాల్‌కు మూడు పరుగులు చేశాడు. ఈ జంటను ఆసీస్ స్పిన్నర్ జంపా విడగొట్టాడు. తర్వాత వచ్చిన పావెల్ కూడా అదే దూకుడు కంటిన్యూ చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది ఆ జట్టు.


westindies won by 35 runs in australia
westindies won by 35 runs in australia

భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగన ఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 23 పరుగులున్నప్పుడు డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. దూకుడుగా ఆడే క్రమంలో కీలక వికెట్లను చేజార్చుకుంది. 100 పరుగుల లోపే మూడు వికెట్లను కోల్పోయింది.

ALSO READ:  సింగపూర్ ఓపెన్‌లో సంచలనం, ప్రపంచ నెంబర్ 2కు గాయత్రి జోడి షాక్

చివరకు ఆసీస్ ఆటగాళ్లలో జోష్ ఇంగ్లిస్ మెరుగైన స్కోర్ చేశాడు. అంతేకాదు జట్టులోని టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాథన్, టిమ్ డేవిడ్, వేడ్ మాత్రమే చెప్పుకోదగిన స్కోర్ చేశారు. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 222 మాత్రమే చేసింది. దీంతో ఆసీస్‌పై 35 పరుగుల తేడాతో విండీస్ విజయం సాధించింది. వార్మప్ మ్యాచ్‌లో కంగారులు ఓడిపోవడం ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే మొదట్లో ఓటమి పాలవుతుందని, తర్వాత విశ్వరూపం చూపిందని అంటున్నారు.

Tags

Related News

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

Big Stories

×