E-Paper
Advertisement

Psycho Thriller OTT : ఒంటరి అమ్మాయితో సైకో సయ్యాట… గుండెలదిరే ట్విస్టులు… క్లైమాక్స్ కేక

Psycho Thriller OTT : ఒంటరి అమ్మాయితో సైకో సయ్యాట… గుండెలదిరే ట్విస్టులు… క్లైమాక్స్ కేక
Advertisement

Psycho Thriller OTT : మాటలు తక్కువ, వైలెన్స్ ఎక్కువ ఉండే సినిమా చూడలనుకుంటున్నారా ? అయితే ఇప్పుడు మనం చప్పుకోబోయే సినిమాపై ఓ లుక్ వేయండి. ఈ సినిమా ప్రత్యేకత మాటలు చాలా తక్కువగా ఉంటాయి. కేవలం నిశ్శబ్దం,నటనతోనే కథ ఉత్కంఠంగా సాగుతుంది. ఈ హాలీవుడ్ సినిమా ఇండియాలో రెండు సార్లు రీమేక్ అయింది కూడా. ఒక చెవిటి అమ్మాయిని టార్గెట్ చేసే కిల్లర్ చుట్టూ కథ ఉంటుంది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘హుష్’ (Hush) అనేది మైక్ ఫ్లానాగన్ దర్శకత్వంలో వచ్చిన ఒక అమెరికన్ స్లాషర్ చిత్రం. ఈ సినిమాలో మేడీ యంగ్‌గా కేట్ సీగెల్ నటించింది. కిల్లర్‌గా జాన్ గల్లఘర్ జూనియర్ నటించారు.కేట్ సీగెల్, ఫ్లానాగన్‌తో కలిసి చిత్రానికి సహ రచయితగా కూడా ఉంది. ఈ చిత్రం 2016 మార్చి 12న సౌత్ బై సౌత్‌వెస్ట్‌లో ప్రీమియర్‌ అయింది. ఈ సినిమా 2016 ఏప్రిల్ 8న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాని భారతదేశంలో రెండుసార్లు రీమేక్ చేశారు. ఒకసారి హిందీ చిత్రం ‘ఖామోషి’గా, మరోసారి తమిళ చిత్రం ‘కొలైయుతిర్ కాలం’. రెండు రీమేక్ చిత్రాలకు చక్రి తోలేటి దర్శకత్వం వహించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మేడీ (కేట్ సీగెల్) అనే రచయిత్రికి చిన్నతనంలోనే మాటలు, వినికిడి శక్తి పోతాయి. ఆమె ఒక నవల రాస్తూ, ప్రశాంతత కోసం అడవి మధ్యలో ఉన్న ఒక ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంటుంది. ఒక రోజు ఆమె స్నేహితురాలు సారా, మేడీని కలవడానికి వస్తుంది. సారా వెళ్ళిపోయిన కొద్దిసేపటికే, ఒక ముసుగు ధరించిన కిల్లర్ ఆమెను చంపాలని చూస్తాడు. సారా ప్రాణాల కోసం అరుస్తూ మేడీ ఇంటి తలుపులు కొడుతుంది, కానీ మేడీకి వినికిడి శక్తి లేకపోవడం వల్ల ఆమెకు ఏమీ వినిపించదు. ఆ తరువాత మేడీ ఇంటి ముందే సారాను దారుణంగా చంపేస్తాడు. మేడీకి చెవుడు ఉందని గ్రహించిన కిల్లర్, ఆమెను ఒక ఆటాడుకుంటాడు.

కిల్లర్ నేరుగా ఇంట్లోకి రాకుండా, మేడీ ఫోన్‌ను దొంగిలించి ఆమె ఫోటోలు తీసి ఆమెకే పంపిస్తాడు. తన ఇంట్లోనే ఎవరో ఉన్నారని గ్రహించిన మేడీ భయపడుతుంది. మేడీ కిల్లర్ నుండి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. మరి ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయా ? మేడీ ప్రాణాలతో బయట పడుతుందా ? కిల్లర్ ఎవరు ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : దెయ్యంతో సైంటిస్ట్ కు దబిడి దిబిడి… అమ్మాయి తోడుగా కావాలంటూ గోల… ఆస్కార్ రేసులో హర్రర్ మూవీ

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×