E-Paper
Advertisement

Allu Arjun: ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అల్లు అర్జున్.. పుష్ప 2 కోసమేనా?

Allu Arjun: ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అల్లు అర్జున్.. పుష్ప 2 కోసమేనా?
Advertisement
bunny
bunny

Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ హైదరాబాద్‌లో సందడి చేశారు.

ఈ మేరకు తన ఇంటర్నేషనల్ లైసెన్స్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చాడు. మరి ఇంత సడెన్‌గా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం వెనుక అర్థమేంటో అని ప్రేక్షకాభిమానులు అనుకుంటున్నారు. మరి ఎందుకు ఈ లైసెన్స్ తీసుకున్నాడో అనే విషయానికొస్తే..

Advertisement

ఐకాన్ స్టార్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి.

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన ఫైటర్.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే..

Advertisement

ఇక ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. అందువల్ల సెకండ్ పార్ట్‌ని దర్శకుడు సుకుమార్ మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సెకండ్ పార్ట్‌లో అల్లు అర్జున్ మరింత డిఫరెంట్ లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వైజాగ్‌లో పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో రష్మిక మందన్న కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆమె తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్న ఈ మూవీ షూటింగ్ అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉంది.

ఇదిలా ఉంటే బన్నీ తాజాగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లై చేశాడు. ఇందులో భాగంగానే ఐరిష్ ఇచ్చేందుకు ఖైరతాబాద్‌ ఆర్టీఓ ఆఫీస్‌కు వచ్చాడు. దీంతో అక్కడంతా ప్రేక్షకాభిమానులు గుమి గూడటంతో సందడి వాతావరణం నెలకొంది.

Also Read: ఈ రోజు టీవీల్లో ఫుల్ యాక్షన్ అండ్ సెంటిమెంట్ మూవీలు.. లిస్ట్ ఇదే

అయితే మరికొంతమంది మాత్రం బన్నీ ఇంత సడెన్‌గా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు తీసుకుంటున్నాడు అని చర్చించుకుంటున్నారు. ఒకవేళ తాను చేస్తున్న పుష్ప2 మూవీ కోసం వేరే దేశాలకు వెళ్తున్నారా? అని గుస గుసలాడుకుంటున్నారు. విదేశాల్లో ఈ మూవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారా?.. అందులో భాగంగానే బన్నీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నాడా? అంటూ చాలా మంది చర్చించుకుంటున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. బన్నీ TG 09 0666 అనే నెంబ‌ర్ గల రేంజ్ రోవర్‌ కారును త‌న పేరుపై రిజిస్టేష‌న్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆర్టీఓ కార్యాల‌య అధికారులు అల్లు అర్జున్‌తో ఫార్మాలిటీస్ పూర్తి చేయించి అత‌నితో సంత‌కాలు చేయించుకున్నట్లు సమాచారం.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×