E-Paper
Advertisement

Allu Arjun: మరో ఫ్రెండ్ కు అల్లు అర్జున్ సాయం.. సాలా సినిమాకు బెస్ట్ విషెస్

Allu Arjun: మరో ఫ్రెండ్ కు అల్లు అర్జున్ సాయం.. సాలా సినిమాకు బెస్ట్ విషెస్
Advertisement

Allu Arjun:ఫ్రెండ్స్ కోసం ఐకాన్  స్టార్ అల్లు అర్జున్ ఏదైనా చేస్తాడు. అలాంటి సంఘటనలు ఇప్పటివరకు చాలానే చూసాం. ముఖ్యంగా తన ఫ్రెండ్స్ సినిమాలకు సాయం చేయడంలో  అల్లు అర్జున్ ముందు ఉంటాడు. చిన్న సినిమాల ట్రైలర్స్  రిలీజ్ చేయడం కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు అటెండ్ అవ్వడం కానీ,  చిత్ర బృందాలకు బెస్ట్ విషెస్ చెప్పడం కానీ చేస్తూ ఉంటాడు.

తాజాగా మరో ఫ్రెండ్ సినిమాకు అల్లు అర్జున్ సాయంగా నిలబడ్డాడు.  తమిళ్ హీరో ధీరన్ నటించిన తాజాగా చిత్రం సాలా. ఎస్ డీ మణిపాల్  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ బాగానే ఆకట్టుకున్నాయి.

Advertisement

ఈరోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్రబృందం.. అల్లు అర్జున్ ను కలవడం జరిగింది. హీరో ధీరన్, హీరోయిన్ రేష్మ వెంకటేష్, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, డైరెక్టర్ ఎస్ డీ మణిపాల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను మీట్ అయ్యారు. బన్నీ.. సాలా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

సాలా సినిమాను రాయపురంలోని ఫేమస్ పార్వతీ బార్ నేపథ్యంతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇలాంటి సినిమాలు తమిళ్ ప్రేక్షకులకు కొత్తేమి కాదు.. కాకపోతే డైరెక్టర్ చూపిన తీరు బావుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. తమిళ్ లో మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటుంది.  బన్నీ వలన ఈ సినిమాకు కొద్దిగా హైప్ వచ్చింది. మరి సాలా సినిమా తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×