BigTV English

Breaking : ఫైనల్ గా జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్..

Breaking : ఫైనల్ గా జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్..

Breaking : నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కు గురైంది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చెయ్యడం ఏంటి..? ఏమైంది? బెయిల్ రాకుండా కేసులు పెట్టారా? ఇలాంటి ప్రశ్నలు జనాల్లో వినిపించిన అంతసేపు కూడా ఆయన జైల్లో ఉండలేదు. ముందుగా ఈ కేసు పై కోర్టుకు వెళ్లిన ఆయనకు కోర్టు ఊరటనిచ్చే తీర్పును ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్న బెయిల్ వచ్చిన ఒక్కరోజు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన కేసులో అరెస్టు అయిన సినీ నటుడు అల్లు అర్జున్ నేడు చంచల్ గూడ జైలు నుంచి రిలీజ్ కానున్నారు.. ప్రస్తుతం ఆయన మంజీరా బ్యారక్ లో ఉంచారు. ఆయన ఎప్పుడు విడుదల అవుతారా అని అభిమానులు భారీ సంఖ్యలో జైలు దగ్గరకు వస్తున్నారు.. నిన్నటి నుంచి తమ అభిమాన హీరో కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.


అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. తమ హీరోను చూసేందుకు జైలు దగ్గరకు భారీగా తరలి వస్తున్నారు. వచ్చిన వారందరిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే 50 వేల రూపాయల జరిమానా చెల్లించాలని తెలిపింది. అలాగే దర్యాప్తు అధికారులకు సహకరించాలని.. బాధితులతో ఎటువంటి సంప్రదింపులు, ప్రలోభాలు చేయకూడదని తెలిపింది.. ఈ కండిషన్ తో బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తుంది. హైకోర్టు లో అల్లు అర్జున్ తీర్పును బెయిల్ కాపీని రాత్రి 10 గంటల సమయంలో చంచల్ గూడ జైలు అధికారులకు ఇచ్చారు. అయితే ఆ కాపీలో తప్పులు ఉన్నాయని జైలు అధికారులు చెప్పడంతో కొన్ని మార్పులను సూచించారు. ఆన్ లైన్ లో కూడా అప్పటికి కాపీ అప్ లోడ్ కాకపోవడంతో ఆయనను శనివారం ఫార్మాలిటీస్ పూర్తి చేసి విడుదల చేస్తామని జైలు అధికారులు తెలిపారు.

ఇక అల్లు అర్జున్ జైల్లోనే నిన్న రాత్రి 8 గంటలకు టీ, స్నాక్స్ తీసుకున్నారని పోలీసులు తెలిపారు. అనంతరం తనకు కేటాయించిన మంజీరా క్లాస్ 1 బ్యారక్ కు వెళ్లారు. రాత్రి అంతా కూడా ఆ బ్యారక్ లోనే ఉన్నారు. అల్లు అర్జున్ విడుదలైన ఈ కేసు ఆయన్ను వెంటాడుతూనే ఉంటుంది. పోలీసులు దర్యాప్తు కోసం పిలిచినప్పుడు ఆయన మళ్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి. లేదా పోలీసులు ఆయన దగ్గరకు వెళ్లి ప్రశ్నిస్తారు. మరోవైపు ఆయన బయట ఉంటారు కాబట్టి ఈ కేసు నుంచి బయటపడేందుకు తనకున్న న్యాయపరమైన అవకాశాలను తానే వెతుక్కోగలరు. ఇక అల్లు అర్జున్ కేసును వాధించిన లాయర్ నిరంజన్ రెడ్డి గురింఛే జనాలు చర్చించుకుంటున్నారు. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకొనేందుకు గూగుల్ లో వెతికేస్తున్నారని తెలుస్తుంది.. ఈ కేసు వల్ల మెగా హీరోలు అల్లు అర్జున్ కోసం కదిలివచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి వీరి గొడవలు ఈ కేసు పోగొట్టిందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×