OTT Latest Malayalam Movies : మలయాళం సినిమాలంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ తెర మీదకు వస్తున్నాయి. వీళ్లు తెరకెక్కిస్తున్న సస్పెన్స్ సినిమాలకు మైండ్ బ్లాక్ అవుతుంది. రోజు రోజుకి వ్యూస్ పెంచుకుంటున్నాయి ఈ సినిమాలు. ప్రస్తుతం ఓటిటి ప్లాట్లో ఫామ్ లో దుమ్ము రేపుతున్న సినిమాల గురించి తెలుసుకుందాం.
కిష్కింద కాండం (Kishkindha kandam)
ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి దింజత్ అయ్యతన్ దర్శకత్వం వహించాడు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీ రీసెంట్ గానే ఓటి టి ప్లాట్ ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disny+Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఏ ఆర్ ఎం (ARM)
టివొని థామస్, కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి ప్రధాన పాత్ర ల్లో నటించారు. ఈ సూపర్ హిట్ మూవీకి జితిన్ లాల్ దర్సకత్వం వహించాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నవంబర్ 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disny+Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
బోగెన్ విలియా (Bougainvillea)
ఫహద్ ఫాజిల్, కుంచాకో బో బన్, వీణానంద కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ బ్లాక్ మాస్టర్ మూవీకి అమల్ నిరద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. రీసెంట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్ సోనీ లీవ్ (SonyLIV)లో స్ట్రీమింగ్ అవుతుంది. తన మతిమరుపుతో గన్ పోగొట్టుకున్న ఒక వ్యక్తి చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. చివరి వరకు సస్పెన్స్ తో ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆలరించింది.
పాణి (Pani)
జోజు జార్జ్, సాగర్ సూర్య ,బాబీ కొరియన్, అభినయ ప్రధాన పాత్రలుపోషించారు. ఈ మూవీకి జోజు జార్జ్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది అక్టోబర్ 24 రిలీజ్ అయిన ఈ మూవీ కమర్షియల్ హిట్ కొట్టింది. యాక్షన్ థ్రిల్లర్ తో వచ్చిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. డిసెంబర్ 20 నుంచి సోనీ లివ్ (SonyLIV) లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రావటానికి సిద్ధంగా ఉంది.
అయిషా (ayisha)
మంజు వారియర్, మోనా తవిళ్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. అమీర్ పల్లికల్ దర్శకత్వం వహించారు. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ ఈ ఏడాది నవంబర్ 29 నుంచి మనోరమ మ్యాక్స్ (ManoramaMAX) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఫ్యామిలీ (Family)
బాసిల్ జోసెఫ్, జగదీష్, మంజు పిల్లాయ్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. నితీష్ సహదేవ్ దర్శకత్వం వహించారు. పైకి మంచివాడిగా నటించే ఒక వ్యక్తి చూట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఈ మూవీ 2023న థియేటర్లలో రిలీజ్ అయింది. కమర్షియల్ గా మంచి కలెక్షన్లు రాబట్టింది. రీసెంట్ గానే ఈ మూవీ మనోరమ మ్యాక్స్ (ManoramaMAX) లో స్ట్రీమింగ్ కు వచ్చింది.