E-Paper
Advertisement

Allu Arjun on Pawan Kalyan: గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టనున్న అల్లు అర్జున్.. పవన్ కల్యాణ్‌తో లంచ్ ప్లాన్!

Allu Arjun on Pawan Kalyan: గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టనున్న అల్లు అర్జున్.. పవన్ కల్యాణ్‌తో లంచ్ ప్లాన్!
Advertisement

Allu Arjun on Pawan Kalyan: టాలీవుడ్‌లో మెగాఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కి మధ్య గ్యాప్ వచ్చింది. ఇటీవల ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వ్యవహారంపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు నాగబాబు చేసిన ట్వీట్‌కు అల్లు వర్సెస్ మెగా వార్‌లా మారింది.అయితే ఈ వివాదాలకు త్వరలోనే ముగింపు పలకనుంది. ఇందుకోసం అల్లు అర్జున్.. పవన్ కల్యాణ్‌తో లంచ్ ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ విషయంపై కనీసం అల్లు అర్జున్ స్పందించకపోవడంతోపాటు విషెస్ కూడా చెప్పకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి మెగా అభిమానులు లేకపోతే అల్లు అర్జున్ ఉండేవాడు కాడని మరోవైపు విమర్శలు వచ్చాయి.

Advertisement

అంతకుముందు పవన్ కల్యాణ్ గురించి అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ అంటూ విమర్శలు చేశారు. ఆ తర్వాత వైసీపీ కి సపోర్టు ఇచ్చి మరోసారి వివాదాన్ని పెద్దగా చేశారు. ఈ సమయంలో నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అయింది. ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు కోసం పనిచేసేవాడు మావాడైన పరాయివాడే.. మాతో నిలబడే వాడు పరాయివాడైన మావాడే’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.

ఇక అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా వాయిదా పడింది. ఈ సమయంలో అల్లు అర్జున్ కి బ్యాడ్ టైమ్ మొదలైంది. దీంతో తనుకు గుడ్ టైంగా మార్చుకునేందుకు సమయం వచ్చింది. ఇలాంటి సమయం ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్న అల్లుఅర్జున్ కి రానే వచ్చింది. వాస్తవానికి అల్లు అర్జున్ వెళ్లి పవన్ కల్యాణ్ కి అభినందనలు చెప్పాలని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

Also Read: ‘కల్కి’ రిలీజ్ ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే ?

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోనే అల్లు అర్జున్. ఆయనను దూరం పెట్టడం మెగా ఫ్యామిలీకి కూడా నచ్చడం లేదు. అల్లు అర్జున్ కూడా అందరితో కలిసి ఉంటే బాగుంటుందనేది సినీ ప్రముఖుల అభిప్రాయం. అయితే ఈ సమస్యలకు అల్లు అర్జున్ సైతం చెక్ పెట్టనున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ ను కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ ను కలిసి తనను స్వయంగా ఇంటికి తీసుకెళ్లి లంచ్ చేయించే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇదే నిజమైతే మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్‌కి గొడవలు ముగిసినట్లే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×