E-Paper
Advertisement

Allu Arjun Pushpa 2 : లక్కీ సెంటిమెంట్‌నే త్యాగం చేసిన బన్నీ… అసలు దీనికి ఎందుకు ఒప్పుకున్నాడు..?

Allu Arjun Pushpa 2 : లక్కీ సెంటిమెంట్‌నే త్యాగం చేసిన బన్నీ… అసలు దీనికి ఎందుకు ఒప్పుకున్నాడు..?
Advertisement

Allu Arjun Pushpa 2.. మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అల్లు అర్జున్ (Allu Arjun) అతి తక్కువ సమయంలోనే మెగా అనే ట్యాగ్ తొలగించి తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నారు. అటు మాస్ హీరోగా, ఇటు లవర్ బాయ్ గా పేరు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ గత రెండేళ్ల క్రితం సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో పుష్ప (Pushpa ) సినిమా చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అసలు బాలీవుడ్ లో ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలైన ఈ సినిమా అక్కడ ఏకంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ కి దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా పుష్ప విడుదల సమయంలోనే పుష్ప -2 (Pushpa -2)ప్రకటించారు.

పుష్ప -2 కోసం వెయిటింగ్..

Advertisement

గంధం చెట్ల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అలా ఎప్పుడో ఆగస్టు 15 న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. అందులో భాగంగానే డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయబోతున్నామని చిత్ర బృందం ప్రకటించింది. దీనికి తోడు ఈ సినిమాకి పోటీగా రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ (Game changer) సినిమా కూడా విడుదల చేయబోతున్నట్లు వార్తలు రాగా.. మెగా వెర్సెస్ అల్లు టఫ్ ఫైట్ రాబోతోంది అంటూ కూడా చాలామంది కామెంట్లు చేశారు. కానీ అంతలోనే రామ్ చరణ్ తన సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ వచ్చే ఏడాది సంక్రాంతి కి 2025 జనవరి10వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

డేట్ మార్చుకున్న పుష్ప -2

Advertisement

ఇదిలా ఉండగా డిసెంబర్ 6న తన లక్కీ డే గా మార్చుకున్న అల్లు అర్జున్ ఆ రోజున విడుదల చేసి గ్రాండ్ సక్సెస్ అవ్వాలనుకొని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇక ఆడియన్స్ తో పాటు అభిమానులు కూడా అదే డేట్ కి ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా డేట్ మార్చుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ విషయాన్ని అల్లు అర్జున్ ఒక పోస్టర్ తో సహా విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 5వ తేదీన సినిమా విడుదల చేస్తున్నామని పోస్టర్ తో సహా అధికారిక ప్రకటన ఇచ్చారు అల్లు అర్జున్.

లక్కీ సెంటిమెంట్ ను త్యాగం చేసిన బన్నీ..

అయితే అల్లు అర్జున్ ఇలా డేట్ మార్చడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి అల్లు అర్జున్ కి 666 అనేది లక్కీనంబర్.. అందుకే డిసెంబర్ (12వ నెల) 6వ తేదీన సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు అంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ విడుదల తేదీని వాయిదా వేసి డిసెంబర్ 5వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే తన లక్కీ నంబర్ సెంటిమెంట్ ను బన్నీ త్యాగం చేశారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి బన్నీ తన లక్కీ నెంబర్ డేట్ ను ఎందుకు త్యాగం చేశారు? అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది. ఏది ఏమైనా ఆయన తన సెంటిమెంట్ ను త్యాగం చేయడంతో అభిమానులలో కొత్త టెన్షన్ మొదలైందనే చెప్పాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×