E-Paper
Advertisement

Guru Pushya Nakshatra 2024: ఈ పరిహారం మీ జీవితాన్నే మారుస్తుంది. డబ్బు కుప్పలుగా వచ్చేలా చేస్తుంది తెలుసా ?

Guru Pushya Nakshatra 2024: ఈ పరిహారం మీ జీవితాన్నే మారుస్తుంది. డబ్బు కుప్పలుగా వచ్చేలా చేస్తుంది తెలుసా ?
Advertisement

Guru Pushya Nakshatra 2024: జ్యోతిష్యశాస్త్రంలో, గురు పుష్య యోగం అన్ని రాశులకు రాజుగా పిలువబడుతుంది. ఈ యోగం ఈరోజు అహోయి అష్టమి నాడు అంటే గురువారం 24 అక్టోబర్ 2024 నాడు ఏర్పడుతోంది. ఈ యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మీరు ఈ రోజున ప్రత్యేకమైన జ్యోతిష్య పరిహారం చేస్తే, మీ జీవితంలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది.

అంతే కాకుండా లక్ష్మీ దేవి ఆశీర్వాదంతో, డబ్బు రావడం ప్రారంభమవుతుంది. ఈ పరిహారాలు కూడా గురు పుష్య యోగం సమయంలో చేయడం విశేషమైంది. గురు పుష్య యోగం వల్ల ఆర్థిక ప్రయోజనాలను మీరు ఎలా పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

గురు పుష్య యోగం సమయంలో ధనవంతులు కావడానికి మార్గాలు..

ఈరోజు అంటే గురు పుష్య యోగం రోజున, 2, 5 లేదా 10 రూపాయల 11 నాణాలను తీసుకొని వాటిని శుభ్రమైన ఎర్రటి గుడ్డలో చుట్టండి. దీని తర్వాత, మీకు ఆర్థిక స్థోమత ఉంటే మార్కెట్ నుంచి ఒక వెండి, ఒక బంగారు నాణెం తీసుకురండి. ఈ రెండు వస్తువులు లేకపోతే, బంగారం స్థానంలో ఎండు పసుపు, వెండి స్థానంలో కొంచెం బియ్యాన్ని చుట్టి, అదే ఎర్రటి గుడ్డలో చుట్టి ఇంట్లోని పూజా స్థలంలో ఉంచండి. దీని తరువాత, పూజగది ముందు కూర్చుని ఈ రోజు సాయంత్రం మహాలక్ష్మిని పూజించండి.

Advertisement

మహాలక్ష్మిని పూజించేటప్పుడు, మీరు ఏదైనా పవిత్రమైన లక్ష్మీ మంత్రాన్ని కూడా జపించవచ్చు. దీపావళి, ధంతేరస్ రోజున కూడా, పూజ సమయంలో ఆ ఎర్రటి వస్త్రాన్ని పూజా సమయంలో ఉంచండి. ధంతేరస్ , దీపావళి రోజు దేవతల విగ్రహాల వద్ద ఉంచి పూజించండి. మరుసటి రోజు, అదే ఎర్రటి గుడ్డలో ఉన్న నాణాలను ఇంట్లో సురక్షితంగా ఉండే ప్రాంతం లేదా డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి.

Also Read: రాహువు, కుజుడి సంచారం.. ఈ 3 రాశుల వారికి అన్నీ మంచి రోజులే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గురు పుష్య యోగంలో చేసే ఈ పరిహారం ప్రజలకు డబ్బు అయస్కాంతంగా వచ్చేలా చేస్తుంది. అంతే కాకుండా ఈరోజు అక్టోబర్ 24న గురువారమే కావడం విశేషం. గురువారం గురు పుష్య యోగం చాలా రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుకే ఈ రోజు డబ్బు నిల్వ ఉండాలన్నా డబ్బుకు ఏ లోటు రాకూడదన్నా కూడా ఈ పరిహారం తప్పకుండా చేయాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×