BigTV English

Justin Trudeau Resignation Demand : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి ఝలక్, రాజీనామాకు పట్టుబట్టిన సొంత పార్టీ ఎంపీలు

Justin Trudeau Resignation Demand : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి ఝలక్, రాజీనామాకు పట్టుబట్టిన సొంత పార్టీ ఎంపీలు

Canada Pm Justin Trudeau : కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు రాజకీయంగా ప్రకంపణలు ఊపందుకున్నాయి. గతంలో అడపాదడపా ప్రతిపక్షాలు రాజీనామాకు డిమాండ్ చేశాయి. కానీ ప్రస్తుతం సొంత పార్టీ నేతలు, అదీ ఎంపీలు డిమాండ్ చేయడం అంటే ట్రూడో పరిపాలనపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ఇట్టే అర్థమవుతోంది. కెనడాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా చేపట్టిన సర్వేల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్‌ సర్కార్ వెనకంజలో ఉన్నట్లు తేలడంతో, తాజాగా 24 మనంది ఎంపీలు ఆయన రాజీనామాకు పట్టుబట్టారు.


 

24 ఎంపీల డిమాండ్ ఒక్కటే…


ప్రధానిగా రాజీనామా చేయాలని 24 మంది లిబరల్‌ పార్టీ ఎంపీలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు డైడ్ లైన్ సైతం విధించారు. అక్టోబర్‌ 28 వరకు టైమ్ ఇస్తున్నామని, ఆలోగా రాజీనామా చేయాలని, లేదా పదవి దిగిపోయేలా తామే చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

 

153 మందిలో 24 మందికి వ్యతిరేకిత…

ట్రూడో రాజీనామా చేయాలన్న లేఖపై 24 మంది సంతకాలు చేశారని కెనడా బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ బహిర్గతం చేసింది. మొత్తం 153 మంది ఎంపీల్లో 24 మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.  ఇప్పటికే ట్రూడో సర్కారు, మైనార్టీలో పడిపోయింది. తాజాగా 24 ఎంపీల అల్టిమేటం వల్ల ప్రభుత్వానికి పెను సవాల్ ఎదురవుతోంది.

 

ప్రధాని వైఖరిపై అసహనం… 

లిబరల్ పార్టీ బుధవారం క్లోజ్డ్‌డోర్‌ సమావేశం నిర్వహించగా, సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్‌, సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతిన్నామని, అందుకు కారణం ప్రధాని ట్రూడో వైఖరేనన్నారు.

 

ఇమ్మిగ్రేషన్ మంత్రి ఏమన్నారంటే…

దీనిపై బదులిచ్చిన ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌, చాలా రోజులుగా ఈ విషయం నలుగుతోందన్నారు. ఎన్నికల్లో ఏం జరిగిందన్న సంగతిని ఎంపీలు నిజాయితీగా ప్రధానికి వివరించారు. ఈ విషయంలో ఆయనకు వినడం ఇష్టమున్నా లేేకపోయినా వారు మాత్రం చెప్పేశారన్నారు.

 

వలసవాదులపైనా కీలక నిర్ణయం…

ఇక వలసల నియంత్రణ కోసం కెనడా సర్కారు మరో నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను భారీగా తగ్గించాలని ఆలోచిస్తోంది. అధికారంలోకి మరోసారి రావాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవన్నట్లు సమాచారం. స్థానిక వార్తా కథనాల మేరకు 2024లో 4,85,000 మందిని కెనడా సర్కార్ శాశ్వత నివాసితులుగా గుర్తించింది. కానీ 2025లో ఈ సంఖ్య 3,80,000కు మాత్రమే పరిమితం చేయడం గమనార్హం. ఇక 2027 నాటికి 3,65,000 మందికి మాత్రమే ప్రవేశం కల్పించాలన్న ఆలోచనలున్నట్లు సమాచారం.

 

తాత్కాలిక ఉద్యోగుల సంగతేంటంటే…

కెనడాలో తాత్కాలిక విదేశీ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నామని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ మేరకు  కంపెనీలకు సంబంధించిన కొన్ని కఠిన నిబంధనలు తీసుకొస్తున్నామన్నారు. ఇక కొలువుల అంశాల్లో స్థానికులకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదో వివరాలు ప్రకటించాల్సి ఉందన్నారు. ఓ వైపు ఖలీస్థాన్ అంశం, మరోవైపు వలసవాదులు, వారికి ఉద్యోగాలు, వర్క్ విసా లాంటి అంశాలు రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయట.

also read : మహారాష్ట్రలో కుదిరిన ప్రతిపక్షాల పొత్తు.. ఇండియా కూటమి 85-85 సీట్ షేరింగ్‌

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×