E-Paper
Advertisement

Allu Arjun – Trivikram : అల్లు అర్జున్ కోసం కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తున్న త్రివిక్రమ్… షూటింగ్ ఎప్పటినుంచంటే?

Allu Arjun – Trivikram : అల్లు అర్జున్ కోసం కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తున్న త్రివిక్రమ్… షూటింగ్ ఎప్పటినుంచంటే?
Advertisement

Allu Arjun – Trivikram : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2) డిసెంబర్లో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఏంటి ? అనే డైలామా మధ్య మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తోనే బన్నీ నెక్స్ట్ మూవీ ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న అదిరిపోయే ప్లాన్స్, షూటింగ్ అప్డేట్ కూడా తాజాగా బయటకు వచ్చింది. మరి బన్నీ, త్రివిక్రమ్ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళబోతుంది? అనే వివరాల్లోకి వెళితే….

‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే నెక్స్ట్ మూవీ ఏంటి? అనే విషయంపై చాన్నాళ్లుగా తర్జన బర్జన జరిగింది. అయితే నిర్మాత నాగ వంశీ అల్లు అర్జున్ (Allu Arjun), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Tivikram) మూవీ నెక్స్ట్ ఉండబోతుందని ప్రకటించడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై త్రివిక్రమ్ రూపొందించబోతున్నాడు. అయితే ఈ సినిమా ఎవరు టచ్ చేయని కొత్త కాన్సెప్ట్ తో ఉండబోతుందని ఆ మధ్య నాగ వంశీ ప్రకటించారు. ఆయన ప్రకటించినట్టుగానే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాతో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని కొత్త ప్రపంచాన్ని ఈ సినిమాతో త్రివిక్రమ్ సృష్టించబోతున్నాడని తెలుస్తోంది. అలాగే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ రాబోతుందని టాక్ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ లేదా జూలై నుంచి సెట్స్ పైకి వెళ్ళొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అని సమాచారం.

Advertisement

అయితే అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతోంది. అయినప్పటికీ నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేయడానికి అల్లు అర్జున్ ఆరు నెలల గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు ? అంటే దానికి కూడా సమాధానం ఉంది. ‘పుష్ప 2’ మూవీ తర్వాత అల్లు అర్జున్ రెస్ట్ కోసం కాస్త గ్యాప్ తీసుకోబోతున్నాడని, అలాగే  త్రివిక్రమ్ (Tivikram) సినిమాకు సంబంధించిన లుక్ లోకి ట్రాన్స్ఫర్ కావడానికి కాస్త టైం పడుతుందని, అందుకే బన్నీ ఇన్ని నెలల గ్యాప్ తీసుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.

అయితే నిజానికి అల్లు అర్జున్ (Allu Arjun) నెక్స్ట్ అట్లీ (Atlee)తో సినిమా చేయబోతున్నాడు అని టాక్ నడిచింది గతంలో. ఆ తర్వాత త్రివిక్రమ్ (Tivikram) ప్రాజెక్టుపై కాన్సన్ట్రేట్ చేస్తాడని అన్నారు. కానీ అట్లీ మల్టీస్టారర్ స్టోరీ చెప్పడంతో అతన్ని పక్కన పెట్టి అల్లు అర్జున్ మళ్ళీ త్రివిక్రమ్ మూవీతో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏదైతేనేం ‘అల వైకుంఠపురం’ వంటి మూడు హ్యాట్రిక్ హిట్స్ తరువాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో పాన్ ఇండియా మూవీ సిద్ధమవుతుండడం అల్లు అభిమానులను ఖుషి చేస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×