Laggam Time First Look: సినీ పరిశ్రమలో కొత్త టాలెంట్‌న ఎంకరేజ్ చేయడం కోసం ఎప్పటికప్పుడు కొత్త నిర్మాతలు వస్తుంటారు. కొత్త నిర్మాణ సంస్థలు ప్రారంభమవుతుంటాయి. తాజాగా అలాంటి ఒక కొత్త నిర్మాణ సంస్థ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతే కాకుండా మొదటి సినిమాను కూడా ప్రారంభించింది. అదే ‘20th సెంచరీ ఎంటర్‌టైన్‌మెంట్స్’. తాజాగా ‘20th సెంచరీ ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థ నిర్మించిన మొదటి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లాంచ్ అయ్యింది. ‘లగ్గం టైమ్’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ కే చంద్ర లాంచ్ చేశారు. ‘లగ్గం టైమ్’ మూవీలో రాజేష్ మేరు, నవ్య చిత్యాల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నెల్లూరు సుదర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి లాంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
యంగ్ డైరెక్టర్ చేతుల మీదుగా
‘లగ్గం టైమ్’ సినిమాకు ప్రజోత్ కె వెన్నం కథ అందించడమే పాటు దర్శకత్వం కూడా వహించారు. కె హిమబిందు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, పవన్ గుంటుకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ అయినా కూడా తనకు సంగీతంలో కూడా పట్టు ఉండడంతో పవనే సంగీతం కూడా అందిస్తున్నాడు. ఇప్పటికే ‘లగ్గం టైమ్’ మూవీ మ్యూజిక్ రైట్స్‌ను ఆదిత్య మీడియా సంస్థ కొనుగోలు చేసింది. ‘లగ్గం టైమ్’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర లాంచ్ చేశారు. సాగర్ కె చంద్ర ‘బీమ్లా నాయక్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యా్ణ్, రానా లాంటి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో హ్యాండిల్ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు.
పెళ్లి నేపథ్యంలో సినిమా
ఇప్పుడు ‘లగ్గం టైమ్’ (Laggam Time) మూవీ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేయడంతో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు సాగర్ కే చంద్ర (Sagar K Chandra). పెళ్లి బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటికీ ఎన్నో కథలు వచ్చాయి. అలాంటి ఒక నేపథ్యంతోనే తెరకెక్కిన ఫీల్ గుడ్ మూవీ ‘లగ్గం టైమ్’ అని మేకర్స్ అంటున్నారు. కుటుంబంతా కలిసి థియేటర్‌కు వెళ్లి చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది అని హామీ ఇచ్చారు. ఇప్పటికీ ‘లగ్గం టైం’ ఫస్ట్ లుక్ మాత్రమే విడుదలయ్యింది. ఇప్పటికీ దీనికి సంబంధించిన ఇతర వివరాలు ఏవీ బయటికి రాలేదు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్‌తో పాటు రిలీజ్ డేట్ను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు. కొత్త నటీనటులు, కొత్త కథ.. ఇలా అన్ని అంశాలతో ‘లగ్గం టైమ్’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనిపిస్తోంది.
Also Read: కూటమి ఎమ్మెల్యేతో స్టార్ యాంకర్ ప్రేమాయణం…? ఆ పబ్ గొడవతో బయటకి..