E-Paper
Advertisement

Allu Sirish New Movie Buddy: ఓటీటీలోకి అల్లు శిరీష్ కొత్తమూవీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Allu Sirish New Movie Buddy: ఓటీటీలోకి అల్లు శిరీష్ కొత్తమూవీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Allu Sirish New Movie Buddy OTT Update: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన లేటేస్ట్ మూవీ ‘బడ్డీ’. ఈ మూవీకి శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. ఇందులో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా, ఈ సినిమా నుంచి మేకర్స్ ఓటీటీ అప్డేట్ ప్రకటించారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫిక్స్‌లో ఆగస్టు 30 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో అజ్మల్, ప్రిషా రాజేశ్ సింగ్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కేఈ రాజా, అధన రాజా నిర్మించారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ మూవీకి కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్‌గా చేశారు.

Also Read: ఒకే వేదికలో చిరు, బాలయ్య కలిసారిలా

Advertisement

సినిమా కథ విషయానికొస్తే.. ఆదిత్య(అల్లు శిరీష్) జాబ్‌లో భాగంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తో మాట్లాడుతుంటాయి. ఈ తరుణంలో అక్కడ పల్లవి (హీరోయిన్ గాయత్రి) పరిచయమవుతోంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే లవ్ ప్రపోజ్ చేసే సమయంలో అనుకోకుండా హీరోయిన్ చేసే చిన్న పొరపాటు ఆదిత్య ఉద్యోగం కోల్పోతాడు.

ఎలాగైనా క్షమాపణలు చెప్పాలని అనుకొని వస్తుండగా.. కిడ్నాప్‌నకు గురవుతోంది. ఈ సమయంలో జరిగిన గొడవలో ఆమె కోమాలోకి వెళ్తుంది. తర్వాత ఆమె ఆత్మ టెడ్డీ బేర్‌లోకి వెళ్తోంది. తర్వాత జరిగే పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. అయితే పల్లవిని ఆదిత్య ఎలా కాపాడాడు? అనేది ఆసక్తికరంగా ఉండనుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×