BigTV English

Allu Sirish : పెళ్లి పీటలు ఎక్కబోతున్న అల్లు శిరీష్.. 10 ఏళ్ల నిరీక్షణ ఫలిస్తుందా..?

Allu Sirish : పెళ్లి పీటలు ఎక్కబోతున్న అల్లు శిరీష్.. 10 ఏళ్ల నిరీక్షణ ఫలిస్తుందా..?

Allu Sirish : మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోలల్లో అల్లు శిరీష్ కూడా ఒకటి.. అయితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారందరు కనీసం ఒక్క సినిమాతో హిట్ కొట్టారు. కానీ ఈ హీరో ఖాతాలో మాత్రం హిట్ పడలేదు. పలు సినిమాల్లో నటించిన నటించాడు. కానీ ఒక్క సినిమా కూడా బ్లాక్ బాస్టర్ కొట్టలేదు. దాంతో సినిమాల కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అయితే అన్నయ్య ఏమో సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుతుంటే, తమ్ముడు మాత్రం ఇలా సినిమాలతో హిట్ కొట్టలేకపోతున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అల్లు శిరీష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో ఒకసారి తెలుసుకుందాం..


అల్లు శిరీష్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా..? 

అల్లు శిరీష్ పెళ్లి ఫిక్స్.. ఇదే వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన పెళ్లి గురించి మాట్లాడారు. ఇంట్లో నన్ను పదేళ్ల నుండి పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉంటారు. కానీ నేను చేసుకోను అని చెప్పాను. పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ పోతుంది. అదే సింగిల్ గా ఉంటే మన ఇష్టమొచ్చినట్టు బ్రతకొచ్చు. నా స్నేహితులలో అనేక మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ళు వాళ్ళ అనుభవం దృష్ట్యా నన్ను పెళ్ళికి బానిస కాకు అని హెచ్చరించారు. మాలాగా పెళ్లి చేసుకొని కష్టాలపాలు అవ్వొద్దు అన్నారు.. అదే ఫాలో అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను అని ఆయన అన్నారు. ఇక గతంలో ఈయన పెళ్లి పై అనేక వార్తలు వినిపించాయి. హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నారంటు వార్తలు వినిపించాయి. వాటి పై శిరీష్ స్పందించలేదు.. మరి పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతాడు అని అల్లు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


సినిమాల విషయానికొస్తే.. 

ఈ హీరోయిన్ ‘గౌరవం’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈయన, తన కెరీర్ లో అత్యధిక శాతం మంచి స్క్రిప్ట్స్ ని ఎంచుకున్నాడు. అయితే ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. కానీ కొత్త జంట మూవీ మాత్రమే కాస్త ఆకట్టుకుంది. మిగిలిన సినిమాలు మాత్రం యావరేజ్ గానే ఆడాయి.గత ఏడాది బడ్డీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ పోస్టు టాక్ ని అందుకున్న కూడా పెద్దగా హిట్ అయినట్టు కనిపించలేదు. అలాగే ఊర్వశివో రాక్షసి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇక ఈ సినిమా పరిస్థితి కూడా అంతే టాక్ ఏమో పాజిటివ్గా ఉన్నా కూడా కలెక్షన్స్ మాత్రం యావరేజ్ గా ఉండడంతో పెద్దగా హిట్ అవ్వలేదు.. హిట్ గా నిల్చిన చిత్రం ఏదైనా ఉందా అంటే, అది ‘శ్రీరస్తు..శుభమస్తు’ చిత్రం మాత్రమే. వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మంచి అయ్యింది. సినిమాలు పరంగా శిరీష పెద్దగా సక్సెస్ అవ్వలేదు.. ఇక పెళ్లయినా చేసుకుంటాడో లేదో అని అల్లు అభిమానులు ఆలోచిస్తున్నారు.. శిరీష్ ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్ ని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×