BigTV English

OTT Movie : డెలివరీ బాయ్ ని లైన్లో పెట్టే అమ్మాయి… ఆ ట్విస్ట్ కి బుర్ర గిర్రున తిరగాల్సిందే

OTT Movie : డెలివరీ బాయ్ ని లైన్లో పెట్టే అమ్మాయి… ఆ ట్విస్ట్ కి బుర్ర గిర్రున తిరగాల్సిందే

OTT Movie : టారో కార్డులు ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. వీటి ద్వారా చెప్పే జాతకం నమ్మదగినవిగా ఉన్నాయని, చాలామంది నిపుణులు అభిప్రాయపడ్డారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఇది ప్రాచుర్యం పొందుతోంది. ఈ కార్డ్ ల ద్వారా జరిగిపోయిన, జరుగుతున్న, జరగబోయే విషయాలను కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ, ఈ టారో కార్డ్ ల చుట్టూ తిరుగుతుంది. ఇందులో మూడు స్టోరీలు ఉంటాయి. ఇవి ప్రేక్షకులకు చెమటలు పట్టిస్తాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

సాంటాస్ విజిట్ (Santa’s Visit) : జి-వూ పనిచేసుకుంటూ బతికే ఒక సాధారణ మహిళ. ఈమెకు ఒక కూతురు కూడా ఉంటుంది. ఈమె సూపర్‌మార్కెట్‌లో పార్ట్-టైమ్ ఉద్యోగం చేస్తుంటుంది. అయితే తన కూతురిని ఒంటరిగా ఇంట్లో వదిలి, క్రిస్మస్ రోజున డ్యూటికి వెళ్తుంది జి-వూ. ఆమెకు ఒక టారో కార్డు కూడా దొరుకుతుంది. ఆ తరువాత ఆమె ఇంట్లో ఉన్న కూతురికి, వింత సంఘటనలు ఎదురౌతాయి. ఇవి చాలా భయంకరంగా ఉంటాయి.


‘ప్లీజ్ త్రో అవే’ (Please Throw Away) : డాంగ్-ఇన్ అనే వ్యక్తి  డెలివరీ బాయ్ గా ఉద్యోగం చేస్తుంటాడు. అతను రాత్రి పూట ఫుడ్ డెలివరీ చేస్తున్నప్పుడు, ఎప్పుడూ చూడని భయపెట్టే సన్నివేశాలను ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో ఒక అమ్మాయికి లిఫ్ట్ కూడా ఇస్తాడు. ఆ తరువాత అతని పరిస్థితి ఇంకా భయంకరంగా మారిపోతుంది. ఈ సంఘటనలు అతను పొందిన టారో కార్డు వల్ల సంభవిస్తుంటాయి. ఈ కార్డు అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది.

‘గోయింగ్ హోమ్’ (Going Home) : క్యోంగ్-రే అనే ఒక వ్యాపారవేత్త, రాత్రి వేళలో ఒక టాక్సీలో ప్రయాణం చేస్తుంటాడు. అతనికి వింత ఆకారాలు కనిపించడంతో, భయాందోళనకు గురవుతాడు. ఈ సంఘటనలు అతను పొందిన టారో కార్డు వల్ల కలుగుతుంటాయి. ఈ ప్రయాణంలో అతనికి భయంకరమైన అనుభవాలు ఎదురౌతాయి.  అతను కోలుకోలేని సమస్యల్లో చిక్కుకుంటాడు. ఇలా ఈ మూడు స్టోరీలు ప్రేక్షకులను, భయంతో వణికించేలా చేస్తాయి.

Read Also : ఓటీటీలో యాక్షన్ తో దుమ్మురేపుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా… ‘కాంతారా’ హీరో ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘టారోట్’ (Tarot). 2024 లో వచ్చిన ఈ కొరియన్ మూవీకి చోయ్ బ్యూంగ్-గిల్ దర్శకత్వం వహించారు. ఇందులో చో యో-జియోంగ్, పార్క్ హా-సన్, కిమ్ జిన్-యంగ్, కో క్యు-పిల్, సియో జి-హూన్, హామ్ యున్-జుంగ్ వంటి నటులు నటించారు. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×