BigTV English

Rohit Sharma: ఆ క్షణం.. నా మైండ్ బ్లాంక్ అయ్యింది.. ప్రపంచకప్ లో ఉత్కంఠ విజయంపై రోహిత్ శర్మ

Rohit Sharma: ఆ క్షణం.. నా మైండ్ బ్లాంక్ అయ్యింది.. ప్రపంచకప్ లో ఉత్కంఠ విజయంపై రోహిత్ శర్మ

Rohit Sharma Reveals Most nervy Moment During T20 WC 2024 Final Match: టీ 20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ ని ఎవరూ మరిచిపోలేరు. ఎందుకంటే అక్షర్ పటేల్ వేసిన ఒక ఓవర్ లో క్లాసెన్ దంచి కొట్టాడు. దాంతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. దాదాపు అందరి ఆశలు సన్నగిల్లిపోయాయి. ఆ ఉత్కంఠ భరిత క్షణాల్లో మీకేమనిపించింది అని రోహిత్ శర్మను అభిమానులు అడిగారు. ప్రస్తుతం హిట్ మ్యాన్ అమెరికా పర్యటనలో ఉన్నాడు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్లొంటున్నాడు. ఈ సందర్భంగా ఓ ఈవెంట్‌లో ప్రపంచకప్ ఫైనల్లో, ఆ లాస్ట్ ఐదు ఓవర్లలో తాను పడిన టెన్షన్ ని అభిమానుల కోరిక మేరకు వివరించాడు.


15వ ఓవర్‌ వేయాలి.. నా ఉద్దేశం క్లాసెన్ షాట్లు కొడుతున్నాడు. ఏమైనా క్యాచ్ దొరుకుతుందేమోననే ఉద్దేశంతో అక్షర్ పటేల్ కి బాల్ ఇచ్చాను. తను కూడా టెంప్ట్ చేస్తూనే బాల్స్ వేశాడు. కానీ క్లాసెన్ అలా చెలరేగిపోతాడని అస్సలు ఊహించలేదు. ఆ క్షణం నా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికి మా పరిస్థితి ఎలా ఉందంటే.. సౌతాఫ్రికా 30 బంతుల్లో 30 రన్స్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది.

ఆ క్షణం.. మేం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాం. కానీ ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే ఎక్కువ టెన్షన్ పడితే, ఎక్కువ తప్పులు చేస్తాం. అందుకే, ఆ ఓవర్ వరకు ఏం చేయాలనేది ఆలోచించామని అన్నాడు.  ఏమాత్రం భయపడలేదు. ప్రశాంతంగా ఉన్నామని అన్నాడు.


ఆ క్షణం హార్దిక్ పాండ్యా వేసిన బౌలింగులో క్లాసెన్ అవుట్ అయినప్పుడు, మాలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. నిజానికి అక్కడ నుంచి బ్యాటింగ్ చేసేవారు సౌతాఫ్రికాలో లేరు. వాళ్లు ఒత్తిడిలో పడ్డారు. క్రీజులో అసౌకర్యంగానే కనిపించారు. దీనిని అర్థం చేసుకుని చివరి ఓవర్లు మనవాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మా బౌలింగ్ చూస్తేనే ఎంత ప్రశాంతంగా ఉన్నామనే విషయం అర్థమవుతుందని అన్నాడు.

Also Read: భార్య పిల్లల ముందే క్రికెటర్ దారుణ హత్య

ఆ క్షణం సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసంతో ఉండి ఉంటే, మన పరిస్థితి వేరుగా ఉండేది. వారు టెన్షన్ పడ్డారు. మనం ప్రశాంతంగా ఉన్నాం. అదే వారికి-మనకి తేడా అని అన్నాడు. అందుకే విపత్కర పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటంతోనే విజయం దక్కింది.’అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక జట్టులోని ఆటగాళ్లందరినీ తన కుటుంబ సభ్యుల్లా చూసుకునేవాడినని, అందుకే ప్రతీ ఒక్కరూ మనసుపెట్టి ఆడారని అన్నాడు.

జట్టులోనే కాదు, మైదానం బయట కూడా వారితో సన్నిహితంగా ఉంటానని తెలిపాడు. నేను కెప్టెన్ అని ఎప్పుడూ భావించనని అన్నాడు. అందుకే తన పని ఈజీ అయ్యిందని చెప్పుకొచ్చాడు. ఏమైతేనేం ఎట్టకేలకు 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టైటిల్‌ను టీమ్ ఇండియా ముద్దాడింది.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×