E-Paper
Advertisement

Amy Jackson Pregnancy: మళ్లీ తల్లి కాబోతున్న హీరోయిన్.. గ్యాప్ లేదు భయ్యా..!

Amy Jackson Pregnancy: మళ్లీ తల్లి కాబోతున్న హీరోయిన్.. గ్యాప్ లేదు భయ్యా..!
Advertisement

Amy Jackson Pregnancy.. ప్రముఖ బ్రిటిష్ – ఇండియన్ యాక్టర్ అమీ జాక్సన్ (Amy Jackson) ప్రస్తుతం యూరప్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఈమె తెలుగు, తమిళ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ఎవడు, ఐ, రోబో 2 వంటి చిత్రాలలో నటించి, ఈ చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకుంది. ఇకపోతే అమీజాక్సన్ సినిమా జీవితం కంటే వ్యక్తిగత కారణాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే మళ్లీ తల్లి అయి అందరిని ఆశ్చర్యపరిచింది.

మళ్లీ ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్..

Advertisement

అమీ జాక్సన్ గతంలో ఒక వ్యక్తితో డేటింగ్ చేసి ఒక బాబుకు జన్మనిచ్చి, ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండానే అతడి నుంచి విడిపోయి, బాబుతో ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలోనే 2024 జనవరి 29వ తేదీన ఈమె హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్ విక్ తో నిశ్చితార్థం జరగగా , ఆ తర్వాత 2024 ఆగస్టు 25న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా అమీ జాక్సన్ ప్రెగ్నెంట్ కాగా అందుకు సంబంధించిన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ కాస్తయినా గ్యాప్ ఇవ్వమ్మా.. మళ్లీ ప్రెగ్నెంట్ ఏంటి..? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

భర్తతో బేబీ బంప్ ఫోటోలు వైరల్..

Advertisement

ఇక తన భర్త ఎడ్ వెస్ట్ విక్ తో క్యూట్ గా బేబీ బంప్ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పలువురు అభిమానులు , నెటిజెన్లు, సెలబ్రిటీలు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అమీ జాక్సన్ విషయానికి వస్తే..

16వ యేటనే మోడల్ గా కెరియర్ ఆరంభించిన అమీ జాక్సన్ 2009లో మిస్ టీన్ వరల్డ్ గా అలాగే 2010లో మిస్ లివర్ పూల్ గా నిలిచింది. ఆ తర్వాత తమిళ సినీ దర్శకుడు ఏ.ఎల్. విజయ్ 2010లో తీసిన మద్రాసపట్టిణం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. లండన్ లో ఉన్నప్పుడు అవకాశం రావడంతో ఇండియాకి వచ్చి నటించడం మొదలుపెట్టింది. 2012లో తన మొదటి బాలీవుడ్ సినిమా ఏక్ దివానా థా విడుదలయ్యింది. అదే ఏడాది ఈమె మొదటి తెలుగు సినిమా ఎవడు కూడా విడుదలయ్యింది. ఆ తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్ అనే సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఏడాది మిషన్ చాప్టర్ వన్ అనే సినిమాతో పాటు క్రాక్ అనే హిందీ చిత్రంలో కూడా నటించింది. ఒక సినిమాలే కాకుండా బుల్లితెరపై కూడా సందడి చేసింది అమీ జాక్సన్. 2017లో ప్రారంభమైన సూపర్ గర్ల్ అనే హిందీ సీరియల్ లో ఇప్పటికీ కూడా నటిస్తూనే ఉంది. అలా ఒకవైపు కెరియర్ను కొనసాగిస్తూనే ఇంకొక వైపు ప్రెగ్నెంట్ అయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది అమీ జాక్సన్.

 

View this post on Instagram

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×