BigTV English
Advertisement

Anand Devarakonda Six Pack: అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు.. గంగం గణేశా కోసం సిక్స్ ప్యాక్.. వాట్ ఏ డెడికేషన్ బాసూ!

Anand Devarakonda Six Pack: అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు.. గంగం గణేశా కోసం సిక్స్ ప్యాక్.. వాట్ ఏ డెడికేషన్ బాసూ!

Anand Devarakonda Six Pack for Gam Gam Ganesha: విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో ఆనంద్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. అన్నకే ఇంకా స్టార్ డమ్ రాలేదు.. ఇప్పుడు తమ్ముడు కూడా వచ్చేశాడు. ఇతను ఏం హీరోగా సెటిల్ అవుతాడు అని అందరూ ట్రోల్ చేశారు. కానీ, ఆనంద్ దేవరకొండ అలాంటివేమీ మనసులో పెట్టుకోలేదు. అమెరికాలో ఎంతో మంచి ఉద్యోగం వదిలేసి.. సినిమా మీద ఫ్యాషన్ తో అన్నలా హీరో అయ్యాడు.


తమ్ముడు హీరో అవ్వడం ఇష్టంలేకపోయినా విజయ్.. అతడి ఆనందం కోసం సపోర్ట్ గా నిలిచాడు. మూడు, నాలుగు సినిమాలా తరువాత బేబీ అనే సినిమాతో ఆనంద్ కు బ్రేక్ దొరికింది. అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా బేబీ నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆనంద్ వరుస సినిమాలను లైన్లో పెట్టి ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆనంద్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి గంగం గణేశా.

ఉదయ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఇక ఈ సినిమా కోసం ఆనంద్ చాలా కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. ఈ విషయాన్నీ ఆనంద్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.


Also Read: Twist in Rave Party: అమ్మ దొంగ.. దొరికిపోయిన నటి హేమ.. అదిరిన బెంగుళూరు పోలీసుల ట్విస్ట్..!

“ఈ సినిమా కోసం నిజంగానే చాలా కష్టపడ్డాను. కండలు పెంచాను” అంటూ చెప్పుకొచ్చాడు. యాక్షన్ సన్నివేశాల్లో ఆనంద్ షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ చూపించనున్నాడట. ఇక లైగర్ సినిమా సమయంలో విజయ్ కూడా ఇలానే సిక్స్ ప్యాక్.. కాదు కాదు 8 ప్యాక్ తో దర్శనమిచ్చాడు. ఇప్పుడు తమ్ముడు వంతు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో బేబీతో వచ్చిన విజయ పరంపరను ఆనంద్ దేవరకొండ కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×