Maruti Launching New Swift CNG Cars: మారుతీ సుజుకి మే 9న దేశీయ మార్కెట్లోకి నాల్గవ తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. అయితే రాబోయే నెలల్లో CNG పవర్‌ట్రెయిన్‌తో ఈ కారును పరిచయం చేయాలని కంపెనీ భావిస్తోంది. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ CNG పవర్‌తో కూడిన మోడల్ 1.2-లీటర్ 3-సిలిండర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. కానీ ఇది పెట్రోల్ మోడల్ కంటే తక్కువ పవర్, టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్న కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ వేరియంట్‌ను బట్టి రూ. 6.49 లక్షల నుండి రూ. 9.64 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరతో ఉంది. అయితే CNG వెర్షన్ పెట్రోల్ కారు కంటే దాదాపు రూ.90,000 నుండి రూ.95,000 వరకు ఎక్కువగా ఉంటుంది. ఫీచర్ల విషయానికొస్తే ఇది ప్రస్తుత మోడల్‌లో ఉన్న ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ 24.8 నుండి 25.75 kmpl మైలేజీని ఇస్తుంది.
Also Read: కారు లవర్స్‌కు కియా బిగ్ గిఫ్ట్.. ఇకపై అద్దెకు కొత్త కార్లు!
నివేదిక ప్రకారం CNG పవర్‌ట్రెయిన్ వేరియంట్‌లో వచ్చే ఈ కారు బైక్‌లాగా 32 km/kg మైలేజీని ఇవ్వగలదు. ప్రస్తుతానికి కొత్త స్విఫ్ట్ సిఎన్‌జి మోడల్ లాంచ్‌కు సంబంధించి వాహన కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. గత వారం విడుదల చేయబడిన కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కొత్త డిజైన్‌లో తీసుకొచ్చారు.
కారు ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, LED DRL, LED ఫాగ్ లైట్లు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED టైల్‌లైట్లు ఉన్నాయి. ఈ కారు LXI, VXI, VXI (O), ZXI, ZXI ప్లస్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కొత్త స్విఫ్ట్ కారులో 5 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇది సిజ్లింగ్ రెడ్, పెరల్ ఆర్కిటిక్ వైట్, మాగ్మా గ్రే, నావెల్ ఆరెంజ్ వంటి అనేక ఆకర్షణీయమైన కలర్స్‌లో అందుబాటులో ఉంది.
Also Read: టీవీఎస్ ST Vs ఓలా S1.. రెండిటిలో ఏది బెస్ట్? రేంజ్ దేనిలో ఎక్కువ?
కొత్త తరం స్విఫ్ట్‌లో మీరు 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, ఆర్కామిస్-ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్‌తో సహా అనేక తాజా ఫీచర్లను చూస్తారు. కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), TCS (ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్), 3-పాయింట్ సీట్‌బెల్ట్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.