Ananya pandey : బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం.. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో నటించింది. ఆ మూవీ హిట్ కాదు కదా కనీసం యావరేజ్ టాక్ ను కూడా సొంతం చేసుకోలేదు. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ నష్టాలు ఇంకా తీరలేదనే వార్తలు గత కొద్దిరోజుల క్రితం బాగా వినిపించాయి.. అయితే ఈ సినిమా హిట్ అవ్వకున్నా ఈ మూవీలో నటించిన అనన్య పాండేకు మాత్రం మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఇక తెలుగులో మంచి ఆఫర్స్ లేకపోవడంతో బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య లైగర్ తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. ఇక మళ్లీ బాలీవుడ్ కు చెక్కెసిన ఈ అమ్మడు అక్కడ పలు సినిమాలు వెబ్ సిరీస్ లను ఆమె చేస్తుండగా ఆ మధ్య పలువురు క్రికెటర్స్ తో డేటింగ్ లో కూడా ఉన్నట్టుగా పలు షాకింగ్ రూమర్స్ వచ్చాయి.. వాటికి పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే అనన్య పేరు నార్త్ ఆడియెన్స్ సోషల్ మీడియాలో మరో రకంగా వైరల్ గా మారింది. కాగా అనన్యపై ఓ వీడియో వైరల్ గా మారింది.. ఓ ఇవేంట్ కు వెళ్లిన ఆమెకు ఓ వ్యక్తి దారుణంగా మోసం చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఏం చేసాడో ఇప్పుడు తెలుసుకుందాం..
అయితే అక్కడ ఒక ఫాస్టర్ తగిలాడు. ఫ్యూచర్ లో 60 కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్ ని పడతావు అంటూ జోస్యం చెప్పాడు. అది కాస్త ఆశను కలిగించింది. అలాగే ఆమెతో పాటుగా మరో యువ నటుడు కూడా ఉన్నాడు అతడికి 2026 కి పెద్ద స్టార్ వి అవుతావు అంటూ అందరి ముందు జోస్యం చెప్పాడు. కానీ ఈ వీడియో మరో రకంగా ప్రొజెక్ట్ అవుతుంది.. అస్సలు అనన్యనే ఇది ఊహించి ఉండదు. అంతగా ఆమె పై వార్తలు వినిపిస్తున్నాయి.. కాగా, అతను వారిద్దరిని వాడుకొని అతను మత ప్రచారం చేసుకుంటున్నాడు అని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా తిరుగుతుంది. కాగా అనన్య రీసెంట్ గా నటించిన సినిమా “సిటిఆర్ఎల్” పాపుల ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ గా నటించిన వెబ్ సిరీస్ కూడా మంచి టాక్ ను అందుకుంది. ఇక ఒకవైపు వెబ్ సిరీస్ లు మరోవైపు సినిమాల తో ఫుల్ బిజీగా గడుపుతుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే.. లేటెస్ట్ ఫొటోల తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..