BigTV English

Actress Seetha: సీనియర్ నటి ఇంట్లో చోరీ.. విలువ ఎంతంటే..?

Actress Seetha: సీనియర్ నటి ఇంట్లో చోరీ.. విలువ ఎంతంటే..?

Actress Seetha: ఇటీవల కాలంలో సెలబ్రిటీల ఇళ్లలో దొంగతనాలు అందరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరొక సీనియర్ నటి ఇంట్లో రెండున్నర సవరన్ల బంగారు నగలు పోయాయి అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తమిళ సినిమాలలో ఆణ్బావం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సీనియర్ నటి సీత (Seetha ) రజనీకాంత్(Rajinikanth), విజయ్ కాంత్(Vijay Kanth) అంటే స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి, భారీ పాపులారిటీ అందుకుంది. ఇకపోతే వయసు పెరిగే కొద్దీ హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళ్, తెలుగు చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా పార్థిబన్ తో విడాకులు తర్వాత సీరియల్ నటుడు సతీష్ ను రెండవ వివాహం చేసుకున్న ఈమె.. ఆఖరికి అతడి నుంచి కూడా విడిపోయింది.


సీత ఇంట్లో దొంగతనం..

ప్రస్తుతం విరుగంబాక్కంలోని పుష్ప కాలనీలో నివసిస్తోంది. అయితే ఇప్పుడు తన ఇంట్లో రెండున్నర సవరన్ల జిమ్కి పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిందట. మిగతా నగలు ఉండడంతో.. తనకు తెలిసిన వాళ్ళు ఎవరో దొంగలించి ఉంటారని సీత అనుమానాలు వ్యక్తం చేస్తుండగా..విరుగంబాక్కం పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిసింది. ఇకపోతే జయం రవి(Jayam Ravi)హీరోగా నటించిన ‘బ్రదర్ ‘సినిమాలో నటించింది. తమిళం తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. అలాగే సీరియల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.


నటి మాత్రమే కాదు నిర్మాత కూడా..

ఇకపోతే ఈమె నటి మాత్రమే కాదు నిర్మాత కూడా.. 1985 నుండి 1990 వరకు హీరోయిన్గా కొనసాగిన ఈమె ‘ఆడదే ఆధారం’ చిత్రంతో నంది అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత 2002లో వచ్చిన ‘మారన్’ అనే తమిళ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి 2004లో తమిళ సినిమా ‘రైటా తప్పా’ అనే సినిమాతో తమిళనాడు రాష్ట్రం ఉత్తమ సహాయ నటి పురస్కారం అందుకుంది.

సీత జీవిత విశేషాలు..

ఇక సీత పుట్టుక, జీవిత విశేషాల విషయానికి వస్తే.. ఈమె తండ్రి స్వస్థలం విజయనగరం జిల్లా, బొబ్బిలి ప్రాంతం. ఈమె తండ్రి మోహన్ బాబు మెడికల్ రెప్రజెంటేటివ్ గా.. ఆమె చిన్నతనంలోనే చెన్నైలో స్థిరపడ్డారట. మోహన్ బాబు సినిమాల్లో నటుడిగా చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించారు. ఇక సీతా మోహన్ బాబు – చంద్రావతి దంపతులకు 1964 లో జన్మించింది. ఈమెకు దుష్యంత్ , పాండు అనే ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. ఈమె 1990లో సినిమాలలో నటిస్తున్నప్పుడే నటుడు పార్థిబన్ తో ప్రేమలో పడి అతడిని వివాహం చేసుకుంది. ఇక ఆ తర్వాత అభినయ, కీర్తన అనే ఇద్దరు కూతుర్లు, రాఖీ అనే దత్తపుత్రుడు కూడా ఉన్నారు. సీత ఇద్దరి కూతుర్లలో ఒకరైన కీర్తన మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అమృత’ అనే సినిమాలో నటించగా.. ఉత్తమ బాలనటిగా నేషనల్ అవార్డు లభించింది. ఇక ఈమె ఖాళీ సమయాలలో తంజావూరు పెయింటింగ్స్ కూడా చేస్తూ ఉంటుంది. ఇక ఈమె కుమార్తె అభినయకు కూడా ఈ చిత్రకళలో ప్రవేశం ఉన్నట్లు సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×