E-Paper
Advertisement

Anchor Siva Jyothi : క్షమించండి అంటూ దిగొచ్చిన శివ జ్యోతి.. దేవుడితో ఆటలా..?

Anchor Siva Jyothi : క్షమించండి అంటూ దిగొచ్చిన శివ జ్యోతి.. దేవుడితో ఆటలా..?
Advertisement

Anchor Siva Jyothi : కొన్ని సందర్భాలలో మాట్లాడే చిన్న చిన్న మాటలు కూడా తీవ్రమైన పరిణామాలకు దారిచేస్తాయి. కొన్ని నవ్వుకుంటూ మాట్లాడినా కూడా అవే సీరియస్ అయిపోతాయి. అదే జరిగింది యాంకర్ శివజ్యోతి విషయంలో. తాను తిరుపతి వెళ్ళిన సందర్భంగా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియా వేదికగా పెట్టింది. అయితే ఆ వీడియోలో మాట్లాడిన కొన్ని మాటలు తీవ్రమైన సంచలనాలకు దారితీసాయి.

ప్రసాదం గురించి వెయిట్ చేయడం అనేది కామన్ గా జరుగుతుంది. ప్రసాదం అనేది తిరుపతిలో కొన్నిచోట్ల ఫ్రీగా ఇస్తారు. ఆ ప్రసాదం తీసుకుంటున్న తరుణంలోనే అడుక్కోవలసి వచ్చింది అనే పదాన్ని మాట్లాడింది. తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్లు అంటూ తను మాట్లాడిన మాటలు తీవ్రంగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. దీనిపైన యాంకర్ శివ జ్యోతి క్లారిటీ ఇచ్చింది.

క్షమాపణలు చెప్పింది

Advertisement

నేను ఆ వీడియో గురించి క్లారిటీ ఇచ్చే ముందు ఆ మాటలు వలన హర్ట్ అయిన వాళ్ళకి క్షమాపణలు చెబుతున్నాను. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమని నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. శ్రీవారి ప్రసాదంపై నేను చేసిన వ్యాఖ్యలు తప్పే.

నన్ను క్షమించమని అందర్నీ అడుగుతున్నాను. పదివేల రూపాయల క్యూలైన్లో ఉన్నామనే ఉద్దేశంతో నేను రిచ్ అన్న మాట అన్నాను. నేను ప్రసాదం గురించి అన్నది ముమ్మాటికీ తప్పె . దానికి నేను వివరణ ఇవ్వడం లేదు క్షమాపణ మాత్రమే అడుగుతున్నాను. అంటూ శివ జ్యోతి ఇన్స్టాగ్రామ్ వేదికగా తన వీడియో అప్లోడ్ చేసింది.

దేవునితోనే ఆటలా?

Advertisement

చాలామందికి దేవుడు అనేది ఒక బేసిక్ ఎమోషన్. దేవుడు ఉన్నాడు అనే నమ్మిన వాళ్లు మాత్రం ఒక్క మాట అన్నా కూడా దాన్ని ఈజీగా తీసుకోలేరు. ఎస్ఎస్ రాజమౌళి లాంటి వ్యక్తికే విమర్శలు తప్పలేదు. అతని మీద కేసులు పెట్టే స్థాయికి చాలామంది వెళ్లిపోయారు. ఇప్పుడు శివ జ్యోతి కూడా అంతకంటే దారుణంగా అయిపోతుంది అనుకున్న తరుణంలో ఆమె ముందుకు వచ్చి చెప్పడం అనేది కొంతమేరకు విమర్శలను తగ్గిస్తుంది.

మొత్తానికి శివ జ్యోతి దిగొచ్చింది దేవునితోనే ఆటలా? అలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు సబబు అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. వీడియో క్లారిటీ ద్వారా అది కొంచెం ఆగే అవకాశం ఉంది.

Also Read: Naga Chaitanya : కార్లను కూడా మనుషుల్లాగే చూస్తాడు, కార్లపై ఇంట్రెస్ట్ పుట్టడానికి అదే కారణం

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×