BigTV English

Anchor Shyamala: బాబొస్తే అదొస్తుంది.. ఇదొస్తుందీ దేవుడెరుగు.. సినిమా డైలాగులు కొట్టకండి..

Anchor Shyamala: బాబొస్తే అదొస్తుంది.. ఇదొస్తుందీ దేవుడెరుగు.. సినిమా డైలాగులు కొట్టకండి..

Anchor Shyamala: యాంకర్ శ్యామల ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆ ప్రభుత్వం ఘోరంగా ఓటమిని చవిచూసింది. అయిన ఆమె ఆ పార్టీ పై అభిమానాన్ని వదల్లేదు. ఇప్పటికి పలు కార్యక్రమాల్లో మాట్లాడుతూ టీడీపీ, జనసేన కూటమి పై మాటల యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా మరోసారి అధికార పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆరేళ్ల బాలిక హత్య ఘటనపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ కూటమి పాలనలో ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని.. చిన్నారులకు, మహిళలకు రక్షణ లేకుండా పోతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా బాధిత కుటుంబానికి పరామర్శించారు. బాలిక హత్య కేసు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల దీనిపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు, ఏపీ ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపించారు.

శ్యామల మాట్లాడిన వీడియోలో నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయట తిరిగే ఈ దేశంలో.. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది. ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసిబిడ్డలు సైతం జంకుతున్నారు. పుంగనూరు ఘటనపై ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచార సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలపై, అత్యాచారాలపై నోరుమెదపరేం సామీ.. రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చిన ఈ కూటమి పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకపోవటం సిగ్గుచేటు. మాకు మా ఆడపిల్లల మానప్రాణాలే ముఖ్యం. బాబు గారూ.. మీ సొంత జిల్లాలో ఇంత ఘోరం జరిగితే మీకేమీ అనిపించలేదా.. బాబొస్తే అదొస్తుంది.. ఇదొస్తుందీ దేవుడెరుగు.. ప్రాణాలు పోతున్నాయి సార్ మీరొచ్చాకా” అంటూ యాంకర్ శ్యామల వీడియో లో మాట్లాడారు ప్రస్తుతం చిత్తూరు ఘటన ఏమో గానీ శ్యామల మాట్లాడిన వీడియో మాత్రం హాట్ టాపిక్ అవుతుంది..


ఇక ఈ వీడియోను వైసీపీ నేతలు షేర్లు చేస్తూ మరింత ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.. శ్యామాల మాటల పై పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లు ఎలా రియాక్ట్ అవుతారో అనేది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా బాలిక హత్య కేసు ప్రకంపనాలు సృష్టిస్తుంది. ఈ కేసు పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది ఆసక్తిగా మారింది…

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by YS Bharathi Reddy (@ysbharathireddy_)

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×