E-Paper
Advertisement

OTT Movie : అడవిలో పెళ్లి కూతురిలా తిరిగే దెయ్యం… ఆ పిల్లాడితో మాత్రమే మాటలు ఆటలు

OTT Movie : అడవిలో పెళ్లి కూతురిలా తిరిగే దెయ్యం… ఆ పిల్లాడితో మాత్రమే మాటలు ఆటలు
Advertisement

OTT Movie : హర్రర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉండడానికి కారణం ఉంది. అవి మూవీ లవర్స్ ను స్క్రీన్ కి కట్టిపడేసేట్టుగా చేస్తాయి. అందుకే ఓటిటిలో లెక్కకు మించి హర్రర్ సినిమాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొత్తగా ఈ జానర్ లో ఎలాంటి సినిమా వచ్చినా మిస్ కాకుండా చూడాలనుకుంటారు. ఎంగేజింగ్ గా ఉండే ఈ హర్రర్ సినిమాలలో కొన్నింటిని చూడడం మొదలు పెడితే ఆపడం కష్టంగా ఫీల్ అవుతారు. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటి ఓ హార్రర్ మూవీనే. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? ఈ హారర్ సినిమా పేరు ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

స్టోరీ లోకి వెళ్తే…

Advertisement

ఈ హర్రర్ మూవీ మొత్తం సూర్య అనే ఒక చిన్న పిల్లాడు, అడవిలో పెళ్లి కూతురులా తిరిగే ఒక దయ్యం చుట్టూ తిరుగుతుంది. సూర్యకు నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. అదే వింత అనుకుంటే ఓ రోజు ఏకంగా అర్ధరాత్రి వయోలిన్ వాయిస్తూ తల్లి కంట పడతాడు. ఈ ఊహించని పరిణామంతో సూర్య తల్లి ఒక్కసారిగా భయపడి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అయితే డాక్టర్ కొన్ని రోజులు అతన్ని ఎక్కడైనా బయటకు తీసుకెళ్తే పరిస్థితి చక్కబడుతుందని సలహా ఇస్తాడు. దీంతో సూర్య తల్లి ఊర్లోని ఓ బంగ్లాకు కొడుకుని తీసుకుని మారిపోతుంది. కానీ ఆ బంగ్లాలో ఎవ్వరూ ఉండరు, పైగా అది పాత బంగ్లా. మొత్తానికి కొత్త ఊరు, కొత్త ఇల్లు కావడంతో సూర్య సంతోషంగా గ్రామం అంతా చక్కర్లు కొడతాడు. ఈ నేపథ్యంలోనే కొంత మంది ఆ ఊరికి దగ్గరలోనే ఉన్న అడవిలో ఒక దయ్యం ఉందని, దుర్గా బడి అని పిలిచే ఆ అడవిలో ఆ భూతం పెళ్లికూతురు డ్రెస్ లో తిరుగుతుందని, ఎప్పుడైనా కనిపించి అది పిలిస్తే అడవిలోకి వెళ్లొద్దని సూర్యకు గ్రామస్తులు వార్నింగ్ ఇస్తారు. అయితే ఈ విషయం విన్నాక సూర్య భయపడతాడు.

కానీ ఓ రోజు తెలియకుండానే ఎవరినో ఫాలో అవుతూ అడవిలోకి అడుగు పెడతాడు. అక్కడికి వెళ్ళాక భాను అనే అమ్మాయి సూర్యకు కనిపిస్తుంది. ఆమెతో మాట్లాడుతాడు కూడా. కానీ అప్పటిదాకా ఎవరికీ కనిపించని ఈ భాను అనే దయ్యం సూర్యకి మాత్రమే కన్పిస్తుంది. అదెలా సాధ్యమో, అతనికి తను ఎలా  కనిపిస్తుందో అర్థంకాక షాక్ అవుతుంది. అంతేకాకుండా ఇంకోసారి కనిపిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తూ భయపెట్టడానికి ట్రై చేస్తుంది. మరి ఆ తర్వాత సూర్య ఏం చేశాడు? అసలు ఆమె సూర్యకు మాత్రమే ఎందుకు కనిపించింది? ఈ భాను పెళ్లికూతురు డ్రెస్ లో అడవిలో దయ్యంగా ఎందుకు తిరుగుతోంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బూత్ పోరి’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. హార్రర్ సినిమాలను ఇష్టపడేవారు ఈ ఇంట్రెస్టింగ్ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి.

Related News

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×