E-Paper
Advertisement

Animal Movie OTT : యానిమల్ డైరెక్టర్ కి షాక్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్..

Animal  Movie OTT : యానిమల్ డైరెక్టర్ కి షాక్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్..
Advertisement
Animal Movie OTT

Animal Movie OTT  : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న కాంబోలో సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన మూవీ యానిమల్. ఈ చిత్రం విడుదలైన తర్వాత పలు రకాల రికార్డు లు నెలకొల్పింది . కానీ అదే రకమైన విమర్శలకు కూడా తావిచ్చింది. కంప్లీట్ అడల్ట్ ఓరియెంటెడ్ కంటెంట్, భీభత్సకరమైన వైలెన్స్ ,ఎన్నడూ కనీ వినీ ఎరుగని హీరో ఎలివేషన్స్ తో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బీభష్టం సృష్టించింది. డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం 750 కోట్లకు పైగా వసూలు రాబట్టి బాక్సాఫీస్ దుమ్ము దులిపింది.

ఇక ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన మూవీలోని వైలెన్స్ తో సందీప్ రెడ్డి అందరికీ షాక్ ఇస్తే నెట్ఫ్లిక్స్ మాత్రం మూవీ స్ట్రీమింగ్ విషయంలో సందీప్ రెడ్డి కి షాక్ ఇచ్చింది. అనిమల్ చిత్రం పూర్తి రన్ టైం 3 గంటల 49 నిమిషాలు. అయితే సెన్సార్ రివ్యూ అయిన తర్వాత ఈ చిత్రాన్ని చాలా వరకు కుదించి.. అతి కష్టం మీద కొన్ని సీన్లు కట్ చేసి సుమారు 28 నిమిషాలు తగ్గించారు.

Advertisement

అలా థియేటర్లో విడుదలైన చిత్రం 3.21 నిమిషాలకు ఫిక్స్ అయింది. మొదట్లో ఈ రన్ టైం చూసి చాలామంది మూవీ ఆడుతుందా అని భయపడ్డారు. ఎందుకంటే మూడు గంటలకు మించి ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టాలి అంటే ఆ స్టోరీకి సత్తా చాలా ఉండాలి. అయినా సరే ఎవరు ఏం చెప్పినా వినకుండా తన కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో సందీప్ రెడ్డి సినిమాని థియేటర్లలో విడుదల చేశాడు. ఊహించిన దానికంటే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మూవీ లవర్స్ అయితే మిస్ అయిన ఆ సన్నివేశాలు ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు.

ఓటీటీ లో ఈ మూవీ 3.49 నిమిషాల రన్ టైం తో వస్తుంది అని.. పూర్తి సినిమాని కంప్లీట్ గా ఎంజాయ్ చేయొచ్చని మురిసిపోయిన అందరికీ నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ఇచ్చింది. నెట్‌ఫ్లిక్స్..కేవలం సెన్సార్ బోర్డు థియారిటికల్ వర్షన్స్ మాత్రమే స్ట్రీమింగ్ చేయాలని భావిస్తోందట. ఇదే నిజమైతే థియేటర్లో ఎలా అయితే సినిమా చూసామో అదే సినిమాని ఇంట్లో కూర్చొని చూడాల్సి వస్తుంది తప్ప మిస్సయిన మిగతా సినిమా చూడలేం అన్నమాట. ప్రస్తుతం ఈ న్యూస్ యానిమల్ మూవీ లవర్స్ కి డిసప్పాయింట్మెంట్ కలిగిస్తోంది. అయితే ఇంకా ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ లేదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×