BigTV English

Tollywood Heroines : 2023 కలిసిరాని హీరోయిన్స్.. డిజాస్టర్ తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీస్..

Tollywood Heroines : 2023 కలిసిరాని హీరోయిన్స్.. డిజాస్టర్ తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీస్..
Tollywood Heroines

Tollywood Heroines : 2023 అప్పుడే పూర్తి కావస్తోంది. ఈ సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి.. కొన్ని చిత్రాలు ఎవరు ఊహించని సక్సెస్ సాధిస్తే మరికొన్ని చిత్రాలు భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి మరి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. కొందరు అనుకోకుండా సూపర్ లెవెల్ ఎంట్రీ అందుకుంటే మరికొందరు అరంగేట్రంలోనే తడబడ్డారు. మరి అలా ఈ సంవత్సరం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ముద్దుగుమ్మలు ఎంతవరకు సక్సెస్ అందుకున్నారో చూద్దాం.


ఈ సంవత్సరం టాలీవుడ్ లో అడుగు పెట్టి పెట్టగానే మొదటి సినిమాతో డిజాస్టర్ చవిచూసిన హీరోయిన్స్ లిస్టు లో గాయత్రీ భరద్వాజ్ కూడా ఉంది. మాస్ మహారాజ్ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మూవీలో తన అందాల ఆరబోతతో అందరినీ ఆకర్షించింది కానీ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద బద్దలైపోయింది. భారీ హైప్ మధ్య వచ్చిన ఈ చిత్రం పేలవమైన పర్ఫామెన్స్ తో డిజాస్టర్ గా మిగిలింది.

ఈ ఏడాది అత్యంత డిజాస్టర్ మూవీ ఏది అంటే గుర్తుకు వచ్చే పేరు ఏజెంట్. ఈ మూవీతో అక్కినేని అఖిల్ సరసన హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సాక్షి వైద్య. పాప అందానికి మార్కులు పడ్డాయి కానీ మూవీ మాత్రం కనివిని ఎరుగని డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే ఈ బ్యూటీ తన లక్ మరొకసారి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున్ మూవీ తో ట్రై చేసింది. ఆ మూవీ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా ఎవరికి తెలియదు. అలా ఈ సంవత్సరం ఈ పాప ఖాతాలో వరుసగా రెండు ఫ్లాపులు ఉన్నాయి.


టైగర్ నాగేశ్వరరావు మూవీ తో పరిచయమైన మరొక హీరోయిన్ నుపురు సనన్. ఆ మూవీ అందించిన చేదు అనుభవంతో.. భక్తకన్నప్ప మూవీ లో ఆఫర్ వచ్చినా కాదు అనుకొని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది ఈ బ్యూటీ. దగ్గుబాటి యంగ్ హీరో.. అభిరామ్ నటించిన అహింస మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన గీతికా తివారి.. తన మొదటి చిత్రంతోనే భయంకరమైన డిజాస్టర్ ని అందుకుంది.

కార్తికేయ 2 తర్వాత మంచి క్రేజ్ తెచ్చుకున్న యాక్టర్ నిఖిల్. అతను చేసిన స్పై మూవీ భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది కానీ బాక్సాఫీస్ దగ్గర పర్ఫామెన్స్ అనుకున్న రీతిలో ఇవ్వలేకపోయింది. ఈ మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయమైన ఐశ్వర్య మీనన్.. గ్లామర్ షో తోటే కాకుండా యాక్షన్స్ సీన్స్ లో కూడా అదరగొట్టింది. ఈ మూవీ డిజాస్టర్ గా మిగలడంతో.. ఈ బ్యూటీ ఫస్ట్ మూవీ ఫ్లాప్ గా మిగిలిపోయింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×