BigTV English

Patanjali: “రామేశ్వరంలో కాకులు.. మరికొన్ని కథలు”.. తెలుగు కవికి కేంద్ర సాహిత్య పురస్కారం..

Patanjali:  “రామేశ్వరంలో కాకులు.. మరికొన్ని కథలు”..  తెలుగు కవికి కేంద్ర సాహిత్య పురస్కారం..

Patanjali: ప్రముఖ తెలుగు కథా, నవలా రచయిత పతంజలి శాస్త్రిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన “రామేశ్వరం కాకులు ..మరికొన్ని కథలు” అనే లఘ కథల పుస్తకానికి ఈ అత్యున్నత పురస్కారం లభించింది. ఢిల్లీలోని ఫిరోజ్‌ షా రోడ్డులో రబీంద్ర భవన్‌లోని సాహిత్య అకాడమీ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 24 భాషల్లో రచించిన కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది.


పతంజలి శాస్త్రి 1945లో పిఠాపురంలో జన్మించారు. ఆయన ఒంగోలు కళాశాలలో చదువుకున్నారు. ఉన్నత విద్యను తిరుపతి, పుణెలో చదివారు. పుణెలోని ప్రతిష్ఠాత్మక దక్కన్ కాలేజీ నుంచి పురావస్తు శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్ గా పతంజలి శాస్త్రి పని చేశారు. వడ్ల చిలుకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరువు వంటి కథా సంపుటాలు ఆయన రచనల్లో ముఖ్యమైనవి. రామేశ్వరం కాకులు నుంచి రోహిణి కథ వరకూ పలు కథలను “రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు” పేరిట పుస్తకంగా రచించారు. దీనికే ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.


Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×