BigTV English

Salaar Movie : సలార్ కోసం కోహ్లీ టీమ్ .. జోష్ లో డార్లింగ్ ఫ్యాన్స్..

Salaar Movie : సలార్ కోసం కోహ్లీ టీమ్ .. జోష్ లో డార్లింగ్ ఫ్యాన్స్..
Salaar Movie

Salaar Movie : ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ సలార్ మూవీ త్వరలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ కాస్త జోరు పెంచారు. కచ్చితంగా డార్లింగ్ సినిమా అంచనాలను మించి ఉంటుంది అని హార్డ్ కోర్ ఫాన్స్ నమ్మకంతో ఉన్నారు. మొన్నటి వరకు కాస్త సైలెంట్ గా ఉన్న మేకర్స్ వెరైటీ గా ప్రమోషన్స్ చేయడానికి రంగంలోకి దిగారు. రెగ్యులర్ అప్డేట్స్ తో చిత్రంపై పాజిటివ్ వైబ్రేషన్స్ ని పెంచడంతోపాటు క్రేజీగా మూవీ అప్డేట్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.


ఈ మూవీ ట్రైలర్ డిసెంబర్ 1 న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ క్రేజీ అప్డేట్ ను వెరైటీగా క్రియేట్ చేశారు. సినిమా కంటెంట్ ను వైరల్ చేయడం కోసం వరల్డ్ కప్ ఫీవర్ ని కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో సలార్ మూవీ టీం వరల్డ్ కప్ ఫీవర్ ని కూడా బ్రహ్మాండంగా వాడేస్తున్నారు.

ఇంతకుముందు కేజిఎఫ్ సినిమాను ప్రమోట్ చేయడానికి కూడా హోంబెల్ ఫిలిమ్స్ వారు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ టీం ని ఉపయోగించుకున్నారు. అప్పట్లో ఐపిఎల్ మ్యాచ్ కొనసాగుతున్న సందర్భంగా కాబట్టి.. కేజిఎఫ్ మీమ్స్ తో క్రికెట్ హైప్ ను బాగా వాడుకున్నారు. అదే పందాలో కొనసాగిస్తూ ఇప్పుడు సలార్ చిత్రం కోసం  ఆర్సిబి ను వాడుతున్నారు. సలార్ మూవీ విడుదలకు ఇంకా 18 రోజుల సమయం ఉంది అంటూ విరాట్ కోహ్లీ జెర్సీపై నెంబర్ తో హైలైట్ చేశారు. 


డిసెంబర్ 1న సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకు సలార్ ఫస్ట్ పార్ట్ ట్రైలర్ విడుదల కాబోతున్నట్టు పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ పోస్టర్ లో సిరాజ్ ..మ్యాక్స్ వెల్.. మధ్యలో అటువైపుగా తిరిగి స్టిల్ ఇస్తున్నట్లు నిలబడ్డ కోహ్లీ..చాలా ఐ కాచింగ్ గా ఉన్నారు. మొత్తానికి సలార్ నిర్మాణ సంస్థ క్రికెట్ ఫీవర్ ను బాగా వాడేస్తున్నారుగా.. అంటున్నారు నెటిజన్స్. హైప్ అయితే బాగా ఇస్తున్నారు కానీ మూవీ అంచనాలకు మించి ఉంటుందా లేదా విడుదల తర్వాత తెలుస్తుంది.

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×