E-Paper
Advertisement

Anushka Shetty Marriage Rumor: మళ్లీ స్వీటీ పెళ్లి వార్తలు.. ఎన్నిసార్లు అతడితోనే అంటకడతారు..?

Anushka Shetty Marriage Rumor: మళ్లీ స్వీటీ పెళ్లి వార్తలు.. ఎన్నిసార్లు అతడితోనే అంటకడతారు..?
Advertisement

Anushka Shetty marriage Rumor: టాలీవుడ్ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ తీస్తే అబ్బాయిల్లో ప్రభాస్ ఉంటే.. అమ్మాయిల్లో అనుష్క ఉంటుంది. సూపర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది అనుష్క. ఈ సినిమా తరువాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. నటనపరంగానే కాకుండా ఆమె వ్యక్తిగతంగా అభిమానించేవారు ఇంకా ఎక్కువమంది. ప్రస్తుతం చాలా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్న స్వీటీ పెళ్లి గురించి ఇప్పుడు కాదు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

మిర్చి నుంచి ప్రభాస్- అనుష్క ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. మేము ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పినా కూడా కొంతమంది మాత్రం వీరు ప్రేమలో ఉన్నారు అని చెప్పుకొస్తూనే ఉన్నారు. ఇక ఆ తరువాత ఒక బిజినెస్ మ్యాన్ తో స్వీటీ పెళ్లి అంటూ రాసుకొచ్చారు. అది కూడా నిజం కాదని స్వీటీ చెప్పుకురావడంతో దానికి ఫుల్ స్టాప్ పడింది. గత కొన్నిరోజులుగా అనుష్క.. ఒక కన్నడ నిర్మాతను వివాహమాడుతుందని పుకార్లు మొదలయ్యాయి.

Advertisement

ఇక ఈ మధ్యనే ఈ వార్తలపై కూడా స్వీటీ స్పందించింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో భాగంగా తన పెళ్లి వార్తలపై స్వీటీ మాట్లాడుతూ.. నేను పెళ్ళికి వ్యతిరేకిని కాను.. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. సోషల్ మీడియాలో వస్తున్న ఏ వార్తల్లోనూ నిజం లేదు” అని చెప్పింది. అయినా కూడా మరోసారి కన్నడ నిర్మాతతో అనుష్క పెళ్లి అంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.

Also Read: Kalki2898AD: కల్కి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. ట్రెండ్ మొదలెట్టండి డార్లింగ్స్

Advertisement

ప్రస్తుతం స్వీటీ కన్నడలో ఒక సినిమా చేస్తుంది. అందువల్లే ఈ వార్తలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ రూమర్స్ విన్న అభిమానులు ఎన్నిసార్లు అతడితోనే అంటకడతారు.. నిజం లేదు అందులో అని ఫైర్ అవుతున్నారు. మరి ఈ భామ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×