BigTV English

SC Expressed Displeasure: ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. సీఎస్‌కు సమన్లు

SC Expressed Displeasure: ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. సీఎస్‌కు సమన్లు

Supreme Court Expressed Displeasure with Uttarakhand Govt.: అడవుల్లో మంటలు చెలరేగడం, వాటిని అదుపు చేసే విషయమై ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి బుధవారం సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమన్లు జారీ చేసింది. శుక్రవారం రోజు తమ ముందు హాజరై అడవుల్లో మంటలు ఎందుకు చెలరేగుతున్నాయి..? వాటిని రాష్ట్ర ప్రభుత్వం నివారించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైతుందోననే అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.


భారీ స్థాయిలో చెలరేగుతున్న మంటలను అరికట్టేందుకు అవసరమైన నిధులు సమకూర్చకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. అదేవిధంగా అడవుల్లో మంటలు మండుతున్న వేళ ఎన్నికల విధుల్లో అటవీ అగ్నిమాపక సిబ్బందిని ఎందుకు నియమించారని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

అయితే, ఉత్తరాఖండ్ అడవులల్లో భారీగా కార్చిచ్చులు చోటు చేసుకుంటున్నాయని, ఇప్పటికే చాలా వరకు అటవీ మంటల్లో దగ్ధమైందని, వాటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాటిని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది.


Also Read: స్వాతి మాలివాల్ పై కుట్ర, ప్రాణాలకు ప్రమాదం: ఆమె మాజీ భర్త నవీన్

ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతంలో భారీ స్థాయిలో మంటలు చెలరేగుతున్నా అవసరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు..? ఆ మంటలను ఆర్పివేసేందుకు అవసరమైన అగ్నిమాపక సిబ్బందిని ఎందుకు నియమించలేదని.. ఎందుకు అలసత్వం వహిస్తున్నారంటూ ? ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

అయితే, అగ్పిమాపక సిబ్బంది నియామక ప్రక్రియ కొనసాగుతుందని, మంటల(కార్చిచ్చులు)ను ఆర్పివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందడంలేదని ఆ రాష్ట్ర తరఫున న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 17న ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ధర్మాసనం ముందు హాజరై, ఇందుకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Related News

Dharmasthala Twist: ధర్మస్థల కేసులో అసలు ట్విస్ట్.. ముసుగు వ్యక్తి అందర్నీ పిచ్చోళ్లను చేశాడా?

Dongs Attack Man: రౌండ్ వేసి మరీ వ్యక్తిపై దాడి చేసిన వీధి కుక్కలు.. దడ పుట్టిస్తున్న వీడియో

Anil Ambani: అంబానీకి ఊహించని షాక్.. తల్లి ఆస్పత్రిలో ఉండగానే ఇంట్లో సీబీఐ సోదాలు

Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌లోని క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. అల్లకల్లోలంగా మారిన చమోలీ జిల్లా

Stray Dog vs Leopard: మనతో మామూలుగా ఉండదు.. పులినే లాక్కెళ్ళిన కుక్క

Kokila Ben: ముఖేష్ అంబానీ తల్లికి అస్వస్థత.. హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలింపు

Big Stories

×