BigTV English

Prabhas Kalki 2898 AD: కల్కి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. ట్రెండ్ మొదలెట్టండి డార్లింగ్

Prabhas Kalki 2898 AD: కల్కి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. ట్రెండ్ మొదలెట్టండి డార్లింగ్

Prabhas Kalki 2898 AD First Single Releasing Soon: పాన్ ఇండియా ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఇక ఎన్నో వాయిదాల తరువాత కల్కి జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఎప్పుడెప్పుడు కల్కి అప్డేట్ వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పుకొచ్చారు. కల్కి మ్యూజికల్ మ్యానియా మొదలుకానుంది. కల్కి ఆడియో రైట్స్ ను సరిగమప సౌత్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్నీ ఒక వీడియో ద్వారా అధికారికంగా తెలిపింది.

ఇక కల్కి మొదటి సాంగ్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే సమయం వచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే మొదటి సాంగ్ ను అనౌన్స్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కల్కిపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. సైన్స్ ఫిక్షన్ కథగా కల్కి తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. సలార్ మంచి పాజిటివ్ టాక్ ను అయితే అందుకుంది కానీ, రికార్డ్ కలక్షన్స్ రాబట్టలేకపోయింది. అందుకే ఇప్పుడు అందరి చూపు కల్కి మీదనే ఉంది. ఇక ఈ సినిమా కాకుండా ప్రభాస్ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. మరి జూన్ 27 న ప్రభాస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.


Also Read: Prabhas – Payal Posts: అక్కడ పాయల్.. ఇక్కడ ప్రభాస్.. ఏంటి మేటర్..?

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big Stories

×