E-Paper
Advertisement

Anushka Shetty:సైలెంట్ గా ఆ పని కానిచ్చేసిన స్వీటీ.. అయోమయంలో ఫ్యాన్స్..?

Anushka Shetty:సైలెంట్ గా ఆ పని కానిచ్చేసిన స్వీటీ.. అయోమయంలో ఫ్యాన్స్..?
Advertisement

Anushka Shetty: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా విషయం తెల్సిందే. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్వీటీ.. మంచి విజయాన్ని అందుకుంది. అప్పుడెప్పుడో నిశబ్దం సినిమా తరువాత ఈ చిన్నది కనీసం మీడియా ముందు కనిపించడం కరువైంది. గతేడాది ప్రమోషన్స్ లో కూడా అంతంత మాత్రమే కనిపించింది.

ఇక సోషల్ మీడియాలో అమ్మడు యాక్టివ్ గా ఉండదు. దీంతో అభిమానులు..  అనుష్క  తదుపరి సినిమాల విషయాల గురించి కానీ, లుక్స్ గురించి కానీ తెలుసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు.  ప్రస్తుతం స్వీటీ చేతిలో  మూడు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో ఘాటీ ఒకటి అయితే .. ఇంకొకటి కథనార్ . ఈ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ రెండు కాకుండా భాగమతి 2 స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది.

Advertisement

Sudigali Sudheer: ‘గాలోడు’ కొంప ముంచిన ‘గోట్’.. హీరోగా మారి తప్పు చేశాడా.. ?

ఇక  ప్రస్తుతం స్వీటీ ఫోకస్ అంతా ఈ  ఘాటీ, కథనార్ సినిమాలపైనే పెట్టిందని తెలుస్తోంది. ఎవరికి తెలియకుండా ఈ చిన్నది  చక్కగా రెండు సినిమాలను ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది.  ఘాటీ కోసమే క్రిష్.. హరిహర వీరమల్లు నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పుడు మొదలుపెట్టిన ఈ సిరీస్.. త్వరగానే ముగించాడట. ప్రస్తుతం ఈ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్  పనులను జరుపుకుంటుంది. ఇంకోపక్క కథనార్ కూడా ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ సినిమా కూడా ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం.

Advertisement

ఇక ఈ విషయం  తెలియడంతో స్వీటీ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ ఫినిష్ అయ్యింది అంటే ఒక పోస్టర్ లేదు.. సెట్ లో ఫొటోస్ లేవు. షూటింగ్ అయిపోయింది అంటే అనుష్క కనిపించదు అని చెప్పుకొస్తున్నారు. కనీసంలో కనీసం షూటింగ్ అయిపోయినట్లు ఒక అప్డేట్ ఇస్తూ పోస్టర్  అయినా రిలీజ్ చేస్తే బావుంటుందని  చెప్పుకొస్తున్నారు. ఇక ఘాటీ మాత్రం త్వరలోనే అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ రెండు ప్రాజెక్ట్స్ తో  స్వీటీ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×