BigTV English

INDIA CHINA BILATERAL TALKS : ఐదేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక చర్చలు, మోదీ జిన్‌పింగ్‌లు ఏం మాట్లాడారో తెలుసా ?

INDIA CHINA BILATERAL TALKS : ఐదేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక చర్చలు, మోదీ జిన్‌పింగ్‌లు ఏం మాట్లాడారో తెలుసా ?

Pm Modi Xi Jinping Bilateral Talks : రష్యాలోని కజాన్​లో బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కీలక పరిణామం జరిగింది. దాదాపుగా ఐదేళ్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య తొలిసారిగా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.


ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం…

ఈ మేరకు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఈ ఇద్దరు దిగ్గజ నేతలు చర్చలు చేశారు. భారత్‌-చైనా సంబంధాలు అనేవి కేవలం రెండు దేశాలకే కాదు, ప్రపంచ శాంతికి, స్థిరత్వానికి ప్రధానమని భావిస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.


ఇరు దేశాల సరిహద్దుల సమస్యలపైనా…

పరస్పరం ఇరు దేశాల మధ్య గౌరవం, విశ్వాసం రెండు దేశాల సంబంధాలకు ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. నాలుగేళ్లుగా సరిహద్దుల్లో నెలకొన్న సమస్యలపైనా ఏకాభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇండియా చైనా అధికారికంగా ఐదేళ్ల తర్వాత సమావేశమయ్యాం. భారత్‌-చైనా సంబంధాలపై చర్చల్లో భాగంగా గత నాలుగేళ్లుగా సరిహద్దు సమస్యలపై ఇటీవలే కుదిరిన ఏకాభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పుకొచ్చారు.

నాలుగేళ్లకు అక్కడ ఉద్రిక్తతలు…

మోదీ- జిన్​పింగ్ మధ్య జరిగిన ఈ భేటీలో భారత్ చైనా అత్యున్నత స్థాయి అధికారులు సైతం భాగమయ్యారు. వాస్తవాధీన రేఖ వెంబడి నాలుగేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలం చర్చల్లో భాగంగా వీటిని ఉద్వాసన పలుకుతూ కీలక గస్తీ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో మోదీ-జిన్​పింగ్​ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

నవంబర్లో 2022లో ఇండోనేషియాలో జరిగిన జీ-20 భేటీలో మోదీ, జిన్​పింగ్​లు పాల్గొన్నారు. అనంతరం ఓ విందులోనూ కలిసి మాట్లాడుకున్నారు. ఇప్పుడు తాజాగా రష్యా వేదికగా మరోసారి కలిశారు దిగ్గజ ప్రపంచ నేతలు.

మ్యుచువల్ కోఆపరేషన్ కావాలి…

‘భారత్ ​- చైనాల మధ్య విభేదాలు, విరోధాలు తొలిగిపోయేందుకు రెండు దేశాల మధ్య పరస్పర సహకారం వెల్లివిరియాలని  డ్రాగన్ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు.

Also Read : మస్క్‌కు వ్యతిరేంగా బిల్ గేట్స్.. కమలా హ్యారిస్‌ ప్రచారానికి 50 మిలియన్ డాలర్ల విరాళం!

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×