E-Paper
Advertisement

Sudigali Sudheer: ‘గాలోడు’ కొంప ముంచిన ‘గోట్’.. హీరోగా మారి తప్పు చేశాడా.. ?

Sudigali Sudheer: ‘గాలోడు’ కొంప ముంచిన ‘గోట్’.. హీరోగా మారి తప్పు చేశాడా.. ?
Advertisement

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక కుర్ర హీరోకు ఉన్న ఫాలోయింగ్ కంటే సుధీర్ కు ఉన్న ఫాలోయింగ్ ఎక్కువ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు యూట్యూబ్ లో ఏ వీడియో కింద కామెంట్స్ లో చూసినా సుధీరే ఉంటాడు. ప్రస్తుతం బుల్లితెరకు సూపర్ స్టార్ అంటే సుధీర్ అనే చెప్పుకొస్తున్నారు. ఒక సాధారణ మెజీషియన్ గా కెరీర్ ను ప్రారంభించి జబర్దస్త్ లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి.. అక్కడ నుంచి టీమ్ లీడర్ గా ఎదిగి.. యాంకర్  గా మారి.. చివరకు హీరోగా మారాడు.

తన స్నేహితులు అందరూ కమెడియన్స్ గా సెటిల్ అవ్వగా.. సుధీర్ మాత్రం తనకున్న టాలెంట్ తో హీరోగా మారాడు. గాలోడు అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో సుధీర్ కు ఉన్న ఫ్యాన్ బేస్ ఏంటో ఇండస్ట్రీలో చాలామందికి అర్ధమయ్యింది. ఇక అదే కాన్ఫిడెన్స్ తో కాలింగ్ సహస్త్ర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్. కొన్ని కారణాల వలన ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమా..  గతేడాది రిలీజ్ అయ్యి ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితేనేం ఓటీటీలో మాత్రం మెప్పించింది.

Advertisement

Deviyani Sarma: జాకెట్ లేకుండా సైతాన్ పాప.. చూపులతోనే చంపేస్తుందిగా

ఇక ఈ సినిమాలు చేస్తుండడంతో సుధీర్ పూర్తిగా యాంకరింగ్ కు దూరమయ్యాడు. ఆ సమయంలోనే తన మూడో సినిమాను అనౌన్స్ చేశాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో సుధీర్ హీరోగా నటించిన సినిమా గోట్. హీరో విజయ్ సినిమాకు ఆ టైటిల్  పెట్టకముందే సుధీర్ ఈ టైటిల్ తో  వచ్చాడు. ఇక ఈ చిత్రంలో సుధీర్ సరసన బ్యాచిలర్ బ్యూటీ దివ్య భారతి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన  పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా  ఆకట్టుకున్నాయి.

Advertisement

ముఖ్యంగా అయ్యో పాపం సారూ సాంగ్ అయితే యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టించింది. సినిమాపై మంచి హైప్ ఉండడంతో.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. ? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సినిమా  రిలీజ్ కు నోచుకోని పరిస్థితిలో ఉందని సమాచారం అందుతుంది. మొదట గోట్ ను తక్కువ బడ్జెట్ లోనే చేయాలనీ అనుకున్నారట.. కానీ, ఉన్నాకొద్దీ బడ్జెట్ పెరిగి చివరకు రూ. 10 కోట్లు అయ్యిందంట. అయినా  ఇంకా సినిమా పూర్తి కాలేదు. మొత్తం సినిమాను పూర్తి చేయడానికి మరో రూ. 5 కోట్లు కావాలని అనడంతో నిర్మాత చేతులెత్తేశాడని టాక్.

పెళ్లి అయినా ఆ విషయంలో ఆగేది లేదంటున్న హీరోయిన్స్..

ఇక నిర్మాత చేతులు ఎత్తడంతో డైరెక్టర్ నరేష్ సైతం సైలెంట్ గా  సైడ్ అయిపోయాడట. దీంతో చేసేది ఏమి లేక సుధీర్.. గోట్ ను గాలికి వదిలేసి మళ్లీ యాంకరింగ్ వైపు అడుగులు వేశాడు.బడ్జెట్  ఎక్కువ అయినా స్టార్ హీరోలకు అయితే పెడతారు కానీ, మార్కెట్ లేని సుధీర్ కు ఎక్కువ ఎందుకు పెడతారు అని ఇండస్ట్రీలో చర్చలు సాగుతున్నాయి. అనవసరంగా సుధీర్ హీరోగా మారి చేతులు కాల్చుకున్నాడా.. ? ఒక పక్క షోస్.. ఇంకోపక్క కామెడీ రోల్స్ చేస్తూ ఉంటే ఈ పాటికీ వరుస సినిమాలతో బిజీగా ఉండేవాడని అంటున్నారు. మరి ఈ సినిమా సుధీర్ కొంప ముంచిందా.. ? లేదా..? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×