BigTV English

Anushka Mother: కూతురు బికినీ పై అనుష్క తల్లి కీలక కామెంట్స్..!

Anushka Mother: కూతురు బికినీ పై అనుష్క తల్లి కీలక కామెంట్స్..!

Anushka Mother: ప్రముఖ సీనియర్ బ్యూటీ, అందాలతార, మంచితనానికి కేరాఫ్ అడ్రస్ అనుష్క శెట్టి(Anushka Shetty)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.’బాహుబలి’ సినిమా తర్వాత ఈమె కెరియర్ లో స్పీడ్ తగ్గించింది. కానీ ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘సూపర్’, ‘బిల్లా’ వంటి చిత్రాలలో అందాలతో గ్లామర్ వొలకబోసిన ఈ ముద్దుగుమ్మ, ‘అరుంధతి’ వంటి చిత్రాలతో తనలోని నట విశ్వరూపాన్ని చూపించింది. ఇక ప్రస్తుతం ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో ‘వేదం’ సినిమా చేసి, అందులో తన పాత్రతో అద్భుతమైన నటన కనపరిచిన అనుష్క, మళ్లీ అదే డైరెక్టర్ దర్శకత్వంలో ‘ఘాటీ’ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో అనుష్క డిఫరెంట్ పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే ఈమె లుక్ కు సంబంధించి విడుదల చేసిన పోస్టర్లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.


బిల్లా సినిమాలో అందాలతో బ్లాస్ట్ చేసిన అనుష్క..

ఇదిలా ఉండగా ప్రభాస్ (Prabhas)హీరోగా నటించిన ‘బిల్లా’ సినిమా గురించి, అందులో తాను వేసుకున్న బికినీ చూసి తన అమ్మ ఏం చెప్పింది? అనే విషయాలను తాజాగా పంచుకుంది అనుష్క. 1978 హిందీ చిత్రం డాన్ కి రీమేక్ గా బిల్లా సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశారు. అలాగే ఈ సినిమాలో కృష్ణంరాజు(Krishnam Raju)కూడా కీలకపాత్ర పోషించగా.. ప్రభాస్ కి జోడిగా అనుష్కతో పాటు నమిత(Namitha), హన్సిక(Hansika) వంటి హీరోయిన్స్ కూడా నటించారు. ఈ సినిమాలో అనుష్క తన అందచందాలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక గతంలో ఈ సినిమా గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి.


డ్రెస్ సెన్స్ పై అనుష్క తల్లి కీలక వ్యాఖ్యలు..

అసలు విషయంలోకి వెళితే.. అనుష్కకు ఏ సినిమాలో అయినా సరే కాస్త పద్ధతి మీరి నటించడం , కనిపించడం ఇష్టం ఉండదు. సినిమాలోకి రాకముందు కేవలం సల్వార్, కమీజ్ లను మాత్రమే ధరించేది. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనను తాను మార్చుకుంది. డ్రెస్సింగ్ స్టైల్ లో మార్పులు వచ్చాయి. కానీ బిల్లా సినిమాలో ఏకంగా అందాలతో బ్లాస్ట్ చేసేసింది. దీనిపై ఒక సందర్భంలో అనుష్క మాట్లాడుతూ..” మా అమ్మ ప్రతిసారి నేను పద్ధతిగా కనిపించాలని అనుకుంటుంది. కానీ నన్ను బిల్లా సినిమాలో చూసిన తర్వాత ఇంకాస్త స్టైలిష్ గా కనిపించవచ్చు కదా.. సగం పద్ధతిగా, సగం మోడ్రన్ గా.. అసలు ఆ డ్రెస్సులు ఏంటి? అని మా అమ్మ అంది. అసలు మా అమ్మ నుంచి నేను ఈ మాటలు ఊహించలేదు. ఒక్కసారిగా నేను ఆశ్చర్యపోయాను. వాస్తవానికి ఈ సినిమాలో నన్ను చూసిన తర్వాత అమ్మ నన్ను బాగా చివాట్లు పెడుతుంది అనుకున్నాను. కానీ అమ్మ ట్రెండ్ కు తగ్గట్టుగా ఆలోచించి, నాపై ఇలాంటి కామెంట్లు చేయడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను” అంటూ నాడు జరిగిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఇక అలా ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే రీయంట్రీలో “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమాలో నటించిన ఈమె, ఇప్పుడు ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×