Thandel Bujji Thalli song: నాగచైతన్య కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా తండేల్. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన చందు, కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు నాగచైతన్య హీరోగా మరో పాన్ ఇండియా సినిమాను సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఐదు రోజుల క్రితం బుజ్జి తల్లి అని ఒక పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాను ఒక యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా టీజర్ కూడా మంచి అంచనాలను పెంచింది. ముఖ్యంగా ఈ టీజర్ లో ఎమోషన్స్ బాగా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇదివరకే సాయి పల్లవి, నాగచైతన్య జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకు మంచి ప్రశంసలతో పాటు కలెక్షన్స్ కూడా వచ్చాయి. మళ్లీ వీరిద్దరూ కలిసి ఈ సినిమాలో కనిపిస్తుండడంతో చాలామందికి ఈ సినిమా మీద క్యూరియాసిటీ మరింత ఎక్కువైంది. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ జరుగుతుంది. ఈ సినిమాలో నాగచైతన్య ఉత్తరాంధ్ర యాసను మాట్లాడబోతున్నాడు. చైతు మొదటిసారి ఇటువంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా వర్కౌట్ అయితే చైతు కెరీర్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది.
ఒక సినిమాకి సంగీతం అనేది ఎంత పెద్ద ప్లస్ అవుతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి బుజ్జి తల్లి అనే పాట ఒక స్లో పాయిజన్ లా ప్రేక్షకులకు ఎక్కుతుంది అని చెప్పాలి. దేవిశ్రీప్రసాద్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ బీట్స్ ఎలా ఇస్తాడో, క్లాస్ వచ్చిన సాంగ్స్ ని కూడా అంతే అద్భుతంగా కంపోజింగ్ చేస్తాడు. దేవి శ్రీ ప్రసాద్ కెరియర్ లో ఎన్నో మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ లిస్టులోకి ఇప్పుడు ఈ సాంగ్ కూడా యాడ్ అవుతుంది. ఒకవైపు దేవిశ్రీ అందించిన పుష్ప మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే, ఈ బుజ్జి తల్లి పాట కూడా అలానే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 30 మిలియన్స్ పైగా వ్యూస్ ఈ పాటకు వచ్చాయి. అంతేకాకుండా ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండ్ లో, ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కడబడితే అక్కడ ఈ పాట దర్శనమిస్తుంది. సినిమాను ఫిబ్రవరి 7వ తారీఖున రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది.
‘Love Song of the Year’ #BujjiThalli from #Thandel is TRENDING on YouTube for music with 30 MILLION+ VIEWS ✨
▶️ https://t.co/ZqKgx9roRiA ‘Rockstar’ @ThisIsDSP soulful melody 🎼
Superb response for the first single. Second single announcement soon.#ThandelonFeb7th… pic.twitter.com/8aiw4ZtgA6
— Geetha Arts (@GeethaArts) December 17, 2024