BigTV English

Mahira Khan: రణబీర్ కపూర్ తో ఆ ఫోటో లీక్.. నా కెరీర్ ముగిసిందనుకున్నాను

Mahira Khan: రణబీర్ కపూర్ తో ఆ ఫోటో లీక్.. నా కెరీర్ ముగిసిందనుకున్నాను

Mahira Khan: ఇండస్ట్రీ- సోషల్ మీడియా మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఇండస్ట్రీలో ఏం జరిగినా సోషల్ మీడియాలో తెలిసిపోతుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో సెలబ్రిటీలు ఏది చేసినా ఆచితూచి చేయాల్సి వస్తుంది. స్టార్స్ గా ఎదిగినవారు పబ్లిక్ గా మందు తాగకూడదు.. సిగరెట్ తాగకూడదు..   ఫ్రెండ్స్ తో అయినా కూడా కలిసి తిరగకూడదు. వారికంటూ ఒక లైఫ్ ఉందని ట్రోలర్స్ మర్చిపోయారు. ఏది చేసినా కూడా సోషల్ మీడియాలో  ట్రోల్ చేసి వారి పరువు తీస్తున్నారు.


ఈ మధ్య AI వచ్చాకా ఇలాంటి ఆగడాలు మరింత పెరిగాయి. వీటి వలన చాలామంది సెలబ్రిటీల లైఫ్ పాడైపోయింది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి.  గతంలో పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ విషయంలో ఇదే జరిగింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన రయీస్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మహీరా. ఈ సినిమా లో అమ్మడి పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ మారిపోతుంది  అనుకున్నారు.

Anushka Mother: కూతురు బికినీ పై అనుష్క తల్లి కీలక కామెంట్స్..!


కానీ,  అమ్మడి బ్యాడ్ లక్.. ఆ సమయంలోనే   మహీరా- రణబీర్  కపూర్ కలిసి  సిగరెట్ తాగుతున్న ఒక ఫోటో లీక్ అయ్యింది.  2017 లో న్యూయార్క్ లో వీరిద్దరూ బయట కూర్చొని చేతిలో సిగరెట్ తాడుతో కనిపించారు. ఈ ఒక్క ఫోటో అప్పట్లో బాలీవుడ్ ను షేక్ చేసింది. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని పుకార్లు షికార్లు చేశాయి. దీని తరువాత మహీరా ఎంత ఫేమస్ అయ్యిందంటే .. సినిమా హిట్ అయినా కూడా అంత పేరు రాదు.

అప్పుడు మహీరా  ఎలా ఫీల్ అయ్యింది అనేది తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” మా ఫోటోలు లీక్ అయ్యినప్పుడు నేను పడిన మనోవేదన అంతా ఇంతా కాదు. అప్పుడు  ఒక వెబ్ సైట్ నా గురించి ఒక ఆర్టికల్ రాసింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఏ నటి కూడా ఇంతటి పేరు తెచ్చుకోలేదు. ఈమెను అందరూ ఆదరించాలని చూస్తుంటే.. ఆమె ఆ క్రేజ్ మొత్తాన్ని పోగొట్టుకొనేలా ఉంది .. అసలు ఈమెకు ఏమైంది అని రాసుకొచ్చారు. అదంతా చూసి  ఏంటి.. నాకేమైనా పిచ్చి పట్టిందా.. ? అని అనుకున్నాను.

Youtube Monitization : యూట్యూబర్స్ కోట్లు ఎలా సంపాదిస్తున్నారో తెలుసా? ఇది తెలిస్తే మీరూ కింగే!

వెంటనే ఒక భయం పట్టుకుంది.  నా కెరీర్ ఇంతటితో ముగిసింది అనుకున్నాను. అప్పుడు  వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో స్ట్రగుల్ అయ్యాను. ఆ ఘటన నాపై ఎంతో ప్రభావం చూపించింది. కలలో కూడా అదే గుర్తొచ్చేది. అప్పటికే విడాకులు అయ్యాయి.. సింగిల్ పేరెంట్ గా ఇబ్బందులను ఎదురుకుంటున్నాను. ఆ సమయంలోనే ఈ ఫోటోలు లీక్ అవ్వడం నేను భరించలేకపోయాను. కానీ, అండగా అన్ని వేళల నా అభిమానులు నాకు తోడున్నారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×