E-Paper
Advertisement

Anushka Shetty : సెట్స్‌లో వంట చేసిన అనుష్క శెట్టి

Anushka Shetty : సెట్స్‌లో వంట చేసిన అనుష్క శెట్టి
Advertisement

Anushka Shetty : టాలీవుడ్ జేజెమ్మ‌గా అంద‌రి మ‌న్న‌న‌లు పొంది స్టార్ హీరోయిన్ గుర్తింపు ద‌క్కించుకున్న క‌న్న‌డ భామ అనుష్క శెట్టి. తెలుగుకే ప్రాధాన్యం ఇస్తూ ఇక్క‌డే సెటిలైంది. లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న క్రేజ్‌ను, ఫ్యాన్ బేస్‌ను మ‌రింత‌గా పెంచుకుందీ అమ్మ‌డు. సైజ్ జీరో కోసం పెరిగిన బ‌రువు త‌గ్గ‌క‌పోవ‌టం ఆమెకు ఇబ్బందిగా మారింది. దీంతో ఆమె దాదాపు రెండేళ్ల పాటు సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మైంది. త‌న బ‌రువు త‌గ్గి ముందు లుక్‌లోకి రావాల‌ని డిసైడ్ చేసుకుంది. ఎట్ట‌కేల‌కు అనుష్క త‌న పాత లుక్‌లోకి వ‌చ్చేసింద‌ని రీసెంట్‌గా ఆమె న‌టించ‌బోయే కొత్త సినిమా పోస్ట‌ర్ చూసిన వారంద‌రూ అంటున్నారు.

అనుష్క న‌టిస్తోన్న 48వ చిత్ర‌మిది. యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో న‌వీన్ పొలిశెట్టి హీరో. సినిమాలో జేజెమ్మ.. అన్విత ర‌వ‌ళి శెట్టి అనే చెఫ్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ పాత్ర కోసం అనుష్క ప్రొఫెష‌న‌ల్ ఉండాల‌నుకుంది. దాంతో ఏకంగా 10 మంది ప్ర‌ముఖ దేశీ, విదేశీ వంట మాస్ట‌ర్స్ ద‌గ్గ‌ర ప్రత్యేక శిక్ష‌ణ తీసుకుంది. ట్రైనింగ్ తీసుకోవ‌ట‌మే కాదండోయ్‌..సెట్స్‌లో ఉన్న వారికి ఆమె స్వ‌యంగా వంటి చేసి పెట్టింద‌ని కూడా వార్త‌లు వస్తున్నాయి. ఈ సినిమా కోసం ఫైవ్ స్టార్ హోటల్‌ను పోలిన సెట్స్ వేశార‌ట నిర్మాత‌లు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ లండన్‌లో ప్రారంభం కానుంది. రా రా కృష్ణయ్య ఫేమ్ మహేష్.పి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×