Jr Ntr : యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అదే NTR 30. నిజానికి సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సింది.కానీ RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. దీంతో తదుపరి సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొరటాల శివ.. ఎన్టీఆర్‌తో చేస్తున్న NTR 30 కోసం మరింత ఎక్కువ సమయం తీసుకున్నారు. స్క్రిప్ట్ అంతా ఓకే అయ్యింది. ఇప్పుడు కొరటాల ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయటంలో బిజీగా ఉన్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. సినిమా కోసం తారక్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకుని స్టైలిష్‌గా మారారు.
ఇప్పుడు NTR 30 విషయంలో మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అదే సినిమా టైటిల్.. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ మేరకు దేవర అనే టైటిల్‌ను ఈ చిత్రం కోసం పెట్టారు. నిజానికి బండ్ల గణేష్.. తన అభిమాన హీరో పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్‌ను దేవర అని పిలుచుకుంటూ ఉంటారు. కానీ ఈ టైటిల్‌ను ఎన్టీఆర్ సినిమాకు పెట్టటం అనేది ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అయితే NTR 30 టైటిల్ విషయంలో తాము ఏది ఫిక్స్ కాలేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.