E-Paper
Advertisement

Anushka : స్వీటీ బర్త్ డే సర్ప్రైజ్ లోడింగ్… ఈసారి డబుల్ ధమాకా

Anushka : స్వీటీ బర్త్ డే సర్ప్రైజ్ లోడింగ్… ఈసారి డబుల్ ధమాకా
Advertisement

Anushka : టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి (Anushka Shetty) చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె రెండు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ వాటికి సంబంధించిన అప్డేట్లు కూడా అనుష్క లాగే ఎక్కడా కనిపించడం లేదు. ఆమెను తెరపై చూడాలని అభిమానులు ఉవ్విళ్ళు ఊరుతున్నప్పటికీ అనుష్క మాత్రం అసలు లైమ్ లైట్లో ఉండట్లేదు. కానీ త్వరలోనే అనుష్క పుట్టినరోజు సందర్భంగా అభిమానుల ఆకలిని తీర్చే అప్డేట్లు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది అనుష్క బర్త్ డేకి డబుల్ బోనాంజా ఉండబోతుందని టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం అనుష్క (Anushka Shetty) ఖాతాలో 2 భారీ బడ్జెట్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. ఒకటి తెలుగు మూవీ, మరొకటి మలయాళ సినిమా. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న తెలుగు సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, ‘ఘాటి’ (Ghaati) అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఒక లేడీ ఓరియంటెడ్ పీరియాడికల్ డ్రామా. ఈ చిత్రంలో అనుష్క సరి కొత్తగా కనిపించబోతోంది. అయితే నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాల నుంచి అప్డేట్స్ రాబోతున్నాయని తెలుస్తోంది. నవంబర్ 7న ‘ఘాటి’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది.

Advertisement

అదే సమయంలో అనుష్క (Anushka Shetty) నటిస్తున్న ఫస్ట్ మలయాళ మూవీ ‘కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్’ (Kathanar – The Wild Sorcerer) మూవీ అప్డేట్ కూడా లోడ్ అవుతున్నట్టుగా సమాచారం. వడివేలు దర్శకత్వం వహించిన ఈ చారిత్రాత్మక ఇతిహాసం మూవీని అత్యాధునిక వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించి విజువల్ వండర్ గా తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్క కీలక పాత్రను పోషించబోతోంది. ఈ రెండు మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లో నుంచి అనుష్క బర్త్ డే కి 2 అప్డేట్స్ రాబోతున్నాయని టాక్ నడుస్తోంది.

కాగా అనుష్క (Anushka Shetty) చివరిసారిగా “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా కంటే ముందే అనుష్క లైమ్ లైట్ కి దూరంగా ఉంటూ వచ్చింది. నిజానికి ‘బాహుబలి’ మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకున్న అనుష్క ఆ తరువాత కూడా అదే జోష్ ను కంటిన్యూ చేయకుండా వెనకడుగు వేసింది. భాగమతి, సైరా నరసింహారెడ్డి, నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి సినిమాలు చేస్తూ వచ్చింది. ఇవన్నీ కూడా ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్న సినిమాలే.

Advertisement

అలాగే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ప్రమోషన్లలో కూడా అనుష్క (Anushka Shetty) పెద్దగా కనిపించలేదు. ఆ మూవీ రిలీజ్ అయ్యాక అసలు కనిపించడమే మానేసింది. అయితే అనుష్క పాటిస్తున్న ఈ స్ట్రాటజీ రానున్న ఆమె సినిమాలకు ప్లస్ పాయింట్ కాబోతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఇప్పటి నుంచి అయినా అనుష్క తన సినిమాలకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ తో అభిమనులతో టచ్ లో ఉంటుందా అనేది చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×