BigTV English
Advertisement

Pawan Kalyan: పవన్ టార్గెట్ మారిందా.. కూటమిలో కుంపటి వాస్తవమేనా.. ఏం జరగనుంది?

Pawan Kalyan: పవన్ టార్గెట్ మారిందా.. కూటమిలో కుంపటి వాస్తవమేనా.. ఏం జరగనుంది?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. అది కూడా బహిరంగ సమావేశంలో, తన కోపాన్నంతా బయటకు వెళ్లగక్కారు పవన్. అయితే పవన్ చేసిన కామెంట్స్ ని బట్టి, తన టార్గెట్ ను మార్చారా.. ఇంతకు పవన్ మనసులో ఏముంది? మున్ముందు పవన్ వ్యూహం ఎలా ఉందో కానీ, ఈ కామెంట్స్ మాత్రం ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారాయి.


పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టి సోమవారం శంఖుస్థాపన చేశారు. అయితే ఈ పర్యటనలో పవన్ చేసిన కామెంట్స్ మాత్రం రాజకీయ దుమారం లేపాయి. తాను తలుచుకుంటే నిమిషాల్లో హోం మంత్రి అవుతానంటూ పవన్ పరోక్షంగా కామెంట్ చేశారని చెప్పవచ్చు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు పవన్ పాత్ర కీలకం. అందుకే సీఎం చంద్రబాబు కూడా పవన్ కు కీలక పంచాయతీ రాజ్ శాఖతో పాటు, డిప్యూటీ సీఎం హోదాను కూడా కల్పించారు. అంతవరకు ఓకే గానీ ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఘటనలు పవన్ ను తీవ్రంగా భాదించినట్లున్నాయి. అందుకే పిఠాపురం వేదికగా కొన్ని సంచలన కామెంట్స్ చేశారు.

పవన్ నెక్స్ట్ టార్గెట్ అదేనేమో…
ఇతర రాష్ట్రాలలో కానీ, ఎక్కడైనా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, హోంమంత్రిగా కొనసాగుతారు. అయితే ఇక్కడ హోంమంత్రిగా కొనసాగే అవకాశం వంగలపూడి అనితకు దక్కింది. పవన్ మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో భాద్యతలు నిర్వర్తిస్తూ, మరోవైపు పంచాయతీ రాజ్ , అటవీ శాఖలకు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. కాగా ఇటీవల రోజురోజుకు బాలికలపై, మహిళలపై అఘాయిత్యాలు అధికమవుతుండగా, ఇదే విషయంపై పవన్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారడం లేదని, హోం మంత్రి కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అంతటితో ఆగక తాను హోంమంత్రిగా భాద్యతలు చేపడితే, వేరే లెవెల్ ట్రీట్ మెంట్ ఉంటుందని చెప్పకనే చెప్పారు పవన్. రాష్ట్రంలో అఘాయిత్యాలు కంట్రోల్ కాకుంటే, హోంమంత్రి భాద్యతలు తీసుకుంటానంటూ పవన్ అన్నారు. అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న తనకు హోంమంత్రి పదవి తీసుకొనే అన్ని అర్హతలు ఉన్నాయన్నది పవన్ భావనగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.


కూటమిలో కుంపటి అస్సలు లేనే లేదు.. పవన్
కూటమిలో భాగమైన టీడీపీ, జనసేన, బీజేపీలను విడదీయడం ఎవరి తరం కాదని పవన్ చేసిన కామెంట్స్ వైసీపీ నేతలను ఉద్దేశించినంటూ జనసేన అంటోంది. ఇటీవల రాష్ట్రంలోని పలు చోట్ల జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య విభేదాలు బయటపడుతున్న నేపథ్యంలో పవన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తమను విడదీయడం ఎవరి తరం కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసం తాము కలిసి ముందుకు సాగుతున్నట్లు పవన్ అన్నారు. వ్యక్తుల స్వార్థానికి కూటమిని ఏమీ చేయలేరని, చిన్నచిన్న వాటిని కూడా సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని, అటువంటి మాయలో పడవద్దంటూ పవన్ కీలక కామెంట్స్ చేశారు.

Also Read: Pawan kalyan: బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి.. హోం మంత్రి అనిత‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఏదిఏమైనా రాష్ట్రంలో పరిస్థితులు మారకపోతే, తన శాఖ మార్పులో కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంటానని, కులాల ప్రస్తావనతో ఎక్కడైనా నిందితులను వదిలినట్లు తెలిస్తే ఊరుకోనంటూ పవన్ తన అభిమతాన్ని వ్యక్తం చేసినట్లు పొలిటికల్ విశ్లేషకుల అంచనా. మరి పరిస్థితులు చక్కబడేనా.. లేకుంటే పవన్ రియల్ గబ్బర్ సింగ్ గా మారేనా అనేది తేలాల్సి ఉంది.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×