BigTV English

Asha Borra: ఫ్యామిలీ స్టార్ చిత్రంపై నటి ఫైర్.. నమ్మించి మోసం చేశారని..

Asha Borra: ఫ్యామిలీ స్టార్ చిత్రంపై నటి ఫైర్.. నమ్మించి మోసం చేశారని..

 Asha Borra Comments on Family Star Movie


Asha Borra (Latest news in Tollywood): ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయింది అంటే అందులో హీరో హీరోయిన్స్ తప్ప మిగతా వాళ్ళు ఉంటారో ఉండరో అనే విషయం సినిమా రిలీజ్ అయ్యేవరకు నమ్మకం లేదు. ముఖ్యంగా చిన్న చిన్న పాత్రలు చేసేవాళ్లకి ఎడిటర్ తో ఎంతో ముప్పు ఉంటుంది. అనవసరమైన సీన్స్ కట్ చేస్తూ వాళ్ళని తీసేస్తూ ఉంటారు. ఇలా చాలా సినిమాల్లో చాలామంది కనిపించకుండానే పోయారు. అంతెందుకు గుంటూరు కారంలో బజ్జీల పాప కుషిత, టిల్లు స్క్వేర్ లో శ్రీసత్య.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్లు ఆశా బొర్రా. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వారికి ఆశా బొర్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆమె వీడియోలు చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యింది.

ఇక ఈ నేపథ్యంలోనే ఆమె నటనను మెచ్చి, ఫామిలీ స్టార్ సినిమాలో ఒక చిన్న పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్లు తెలిపింది. అయితే సినిమా మొత్తంలో కొంతవరకు ఆమె పాత్రను బాగానే డిజైన్ చేశారని, సినిమా రిలీజ్ అయ్యాక కేవలం ఒక్క ఫ్రేమ్ లో మాత్రమే కనిపించేలా చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం మీద ఆమె స్పందిస్తూ ఒక సుదీర్ఘమైన పోస్ట్ ని రాసుకు వచ్చింది. అందులో నాలాంటి దాన్నీ పిలిచి అవుట్ స్టఫ్ లాగా వాడుకుంటే సినిమా అట్టర్ ప్లాప్ కాకుండా ఏమవుతుంది..? ఫ్యామిలీ స్టార్ కు కంగ్రాట్యులేషన్స్.. సెలబ్రేషన్స్.. అంటూ మొదలుపెట్టింది.


” ఇంతొటి అప్పియరెన్స్ కి నా టైమ్ వేస్ట్ చేసి, మీ టైం వేస్ట్ చేస్కుని అనవసరంగా కాల్స్, హుంగామా, మీరు చెయ్యండి ఈ క్యారెక్టర్ అని అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరనుంచి కాస్టింగ్ డైరెక్టర్ వరకు అడిగి అడిగి తీసుకెళ్లారు. హైదరాబాద్ లో జూనియర్ ఆర్టిస్ట్ లకు కరువు వచ్చిందా.. ? లేక సోషల్ మీడియా ఫేసెస్ ను యూజ్ చేసుకోవాలని చేసారో మరి.. మా పనులు మానుకుని ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఒకరోజు నా కంఫర్ట్ జోన్ నుండి బయటకొచ్చి , ఆరోగ్యం పూర్తిగా సహకరించకపోయినా కూడా, షూట్ డేట్ కి వస్తాను అని ఇచ్చిన ఒక్క మాట కోసం వచ్చి, యాంటీ బయాటిక్స్ వేసుకుని మరీ ఇంత కాలం గడిపాను.

కనీసం ఒక్క డైలాగ్ ఉన్నా కూడా ఇంత అవసరం లేకుండా ఉండేదేమో.. ఇస్తామన్న రెమ్యూనిరేషన్ ఇవ్వకుండా, ప్రయాణ ఖర్చులు, హోటల్ ఖర్చులు కూడా ఇవ్వకుండా.. మాకేంటి సంబంధం అన్నట్లు.. రెస్పాన్స్ కూడా ఇవ్వకుండా.. చాలా బాగా చేశారు. కనీసం.. విజయ్ దేవరకొండకు నాకు మధ్య ఉన్న సంభాషణలను అయినా ఉంచితే కొద్దిగా సంతృప్తి ఉండేది. మీ ఎడిటింగ్ కు ఒక దండం. ఇలా మాట్లాడితే.. కాంట్రవర్సీ చేస్తుంది అని అంటారు” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆశ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దిల్ రాజూ ప్రొడక్షన్ ఇంత దారుణంగా ఉందా..? ఆర్టిస్టులను ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారా.. ? అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×