E-Paper
Advertisement

Ashok Galla: మహేష్ మేనల్లుడు.. మంచి ఛాన్స్ పట్టేశాడు..

Ashok Galla: మహేష్ మేనల్లుడు.. మంచి ఛాన్స్ పట్టేశాడు..
Advertisement

Ashok Galla: సూపర్ స్టార్ కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో అశోక్ గల్లా ఒకరు. మహేష్ బాబు ముద్దుల మేనల్లుడుగా హీరో సినిమాతో అశోక్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత అశోక్ అస్సలు పత్తా లేకుండా పోయాడు. ఇక గత కొన్నిరోజుల క్రితం అశోక్ తన రెండవ సినిమాను ప్రకటించాడు.

Advertisement

దేవకీ నందన వాసుదేవ అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అశోక్ సరసన మానసి వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక నేడు అశోక్ పుట్టినరోజు కావడంతో మేకర్స్ ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేసి అశోక్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.

ఇక అశోక్ పుట్టినరోజున అతని మూడోవ సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ తో హిట్ అందుకొని టాప్ లో ఉన్న సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. తాజాగా ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అశోక్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రానికి ఉద్భవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

స్టార్చ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని కూర్చోబెట్టి దానికి ఒక చేతిలో కొబ్బరి బొండం ఇచ్చి.. మైక్ పెట్టారు. పోస్టర్ ను బట్టి ఈ సినిమా అమెరికా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. కలలు, వాస్తవాల మధ్య చిక్కుక్కున యువకుల కథ అంటూ మేకర్స్ రాసుకొచ్చారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అశోక్ సరసన లవర్ బ్యూటీ శ్రీ గౌరీ ప్రియ నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మంచి ఛాన్స్ పట్టేసిన అశోక్. ఈ బ్యానర్ లో మంచి హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×