Ukraine Attacked On Russia With Drones: రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజు రోజుకి పెరుగుతుంది. తాజాగా రష్యాపై శుక్రవారం నాడు 40 డ్రోన్లను ఫైర్ చేసింది. ఈ ఘటన బోర్డర్ ప్రాంతం రోస్టోవ్ వద్ద ఈ అటాక్ జరిగినట్లు రష్యా రక్షణ అధికారులు తెలపారు. ఈ దాడిలో కనీసం ఆరు సైనిక విమానాలు ధ్వంసమయ్యాయని, మరో ఎనిమిది తీవ్రంగా దెబ్బతిన్నాయని బార్సెన్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఎక్కువ సంఖ్యలో డ్రోన్లలను ఉపయోగించినట్లు తెలుస్తోంది.
అయితే, రష్యా రక్షణ అధికారులు 40కి పైగా ఉక్రేనియన్ డ్రోన్‌లను అడ్డుకున్నారని, కేవలం విద్యుత్ సబ్‌స్టేషన్ మాత్రమే దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఈ వైమానిక స్థావరంలో సు-24,సు-34 ఇతర ట్రాక్టికల్ బాంబులను ఉంచుతారు. వీటిని రష్యా పైలెట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తారు. రష్యాలోని మొరోజోవ్స్క్ ఎయిర్‌బేస్‌పై డ్రోన్ దాడిలో 20 మంది సిబ్బంది మరణించారు.
ఉక్రెయిన్ అధికారులు శుక్రవారం ప్రకటించారు. మొత్తం 53 డ్రోన్లను ఏకకాలంలో ప్రయోగించినట్లు సమాచారం. మొరోజోవ్స్క్ ఎయిర్‌బేస్ వద్ద భారీగా పేలుళ్లు జరుగుతున్న వీడియో వైరల్ గా మారింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వేల మంది అమాయకులను పొట్టనబెట్టుకుంది. దాదాపు రెండేళ్ల నుంచి ఈ యుద్ధం జరుగుతోంది. రష్యా భూభాగంపై కూడా ఉక్రెయిన్ విజయవంతంగా దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సెంట్రల్ టాటర్ స్టాన్ లోని ఓ భారీ చమురు కేంద్రం డ్రోన్ల అసెంబ్లీ యూనిట్లపై కీవ్ విరుచుకుడింది.