BigTV English

World Health Day 2024 : ఈ నాలుగు పనులతో ఆందోళన దూరం!

World Health Day 2024 : ఈ నాలుగు పనులతో ఆందోళన దూరం!
World Health Day 2024
World Health Day 2024

World Health Day 2024 : వేగంగా మారుతున్న జీవనశైలి ప్రభావం మన ఆరోగ్యంపై కూడా కనిపిస్తుంది. మన ఆహారం నుంచి మన జీవనశైలి వరకు, ప్రతిదీ మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మంచి జీవితాన్ని గడపడానికి ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అయినప్పటికీ.. ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి వేగంగా మారుతుంది. దీని కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.


ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక నిర్దిష్ట ఆరోగ్య సమస్య గురించి అవగాహన కల్పించడానికి, ప్రజలను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుతుంది. ఈ రోజుల్లో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రజలు అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఆందోళన అనేది ఈ సమస్యలలో ఒకటి. దీని కారణంగా ప్రజలు తరచుగా సమస్యాత్మకంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఆందోళనను తగ్గించడానికి కొన్ని సమర్థవంతమైన చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.

Also Read : అందమైన కురులు.. ఈ నేచురల్ టిప్స్‌తో మీ సొంతం!


సమస్యను గుర్తించండి

ఆందోళనను నివారించడానికి మీ సమస్యకు దోహదపడే కారణాలను గుర్తించండి. సాధ్యమైనప్పుడల్లా వాటిని బహిర్గతం చేయడానికి ప్రయత్నించండి. మీ నమకస్తులు, సన్నిహితులతో మీ సమస్యను పంచుకోండి.

గతం గురించి ఆలోచించకండి

భవిష్యత్తు గురించి చింతించకుండా, గతం గురించి ఆలోచించకుండా ప్రజెంట్‌పై దృష్టి పెట్టండి. దీని కోసం మీరు లోతైన శ్వాస తీసుకోండి. మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్‌ల సహాయం తీసుకోవచ్చు. ఇది మీ దృష్టిని ప్రసెంట్‌పైకి తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుంది. అలానే ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.

విశ్రాంతి లేదా శారీరక శ్రమ 

మీ దినచర్యలో యోగా, ధ్యానం, ప్రకృతిలో సమయం గడపడం మొదలైన వంటివి చేయండి. శారీరక కార్యకలాపాలను పాటించండి. శరీరం చురుకుగా ఉండాలంటే శారీరక శ్రమ చాలా అవసరం. ఇది మీ మనస్సును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Also Read : అవకాడో అద్భుతాలు.. తెలిస్తే వావ్ అనాల్సిందే!

మంచి ఆలోచన

ఆందోళనను కంట్రోల్ చేయడానికి చెడు ఆలోచనలకు దూరంగా ఉండటం ముఖ్యం. అటువంటి పరిస్థితిలో మంచి వ్యక్తులతో స్నేహంగా మెలగండి. చెడు ఆలోచలనల వైపు మీ దృష్టి వెళుతుంటే సానుకూల ఆలోచనల వైపు మీ దృష్టిని కేంద్రీకరించండి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×