
Astrologer Venu Swamy : తెలిసి చెబుతాడు..లేక నోటి పవరో తెలియదు కానీ వేణు స్వామి చెప్పాడు అంటే పాపం సెలబ్రిటీల విషయంలో అది నిజమైపోతుంది. అలా సెలబ్రిటీల జాతకాలు చెప్పి బాగా ఫేమస్ అయ్యాడు వేణు స్వామి. నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత ఇద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరు అని బాంబు పేల్చి సంచలనం సృష్టించాడు. అలా అతను చెప్పినట్లే కొంతకాలానికి ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ జంట కాస్త విడిపోయింది. దీంతో అప్పటి వరకు వేణు స్వామిని విమర్శించిన వారు అతను చెప్పే దాంట్లో ఎంతో కొంత నిజం ఉంది అని భావించడం మొదలుపెట్టారు.
రీసెంట్ గా ప్రభాస్ మూవీస్ గురించి వేణు స్వామి చేసిన సంచలన వ్యాఖ్యలు ఫాన్స్ కి కోపం తెప్పించినా ..ఫైనల్ గా నిజమని ప్రూవ్ అయ్యాయి. అయితే ఇప్పుడు వేణు స్వామి తాజాగా ఇండస్ట్రీలో మరొక టాలీవుడ్ హీరో సూసైడ్ చేసుకోబోతున్నాడని బాంబు పేల్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా.. ఇంతకీ ఆ హీరో ఎవరో అంటూ నేటిజన్స్ ఆరాలు మొదలుపెట్టారు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి.. రాజమౌళి పది పైసలు పక్కన తీసి పడేస్తే అది రూపాయిగా మారుతుంది.. ఆయన పేరు ఉంటే చాలు ఎటువంటి సినిమా అయినా హిట్ అవుతుంది..అని రాజమౌళి జాతకం చెప్పాడు. ఇక ఈ సందర్భంగా ప్రభాస్ గురించి నేను చెప్పినట్లే జరుగుతోంది కదా..బాహుబలి తర్వాత ఇంకేదన్నా ఆ రెంజ్ హిట్ అందిందా.. అని ఈ సందర్భంగా ప్రభాస్ గురించి తాను చెప్పిన మాటలను గుర్తు చేశాడు.
ఇక అక్కడితో ఆగకుండా టాలీవుడ్ లో నందమూరి తారకరత్న లాంటి జాతకం ఉన్న మరొక హీరో మరణిస్తాడు అంటూ బాంబు పేల్చాడు. ఆ సదరు హీరో తులారాశి లేక వృశ్చిక రాశి కి సంబంధించిన వాడై ఉంటాడట. అలాగే మిధున రాశికి చెందిన మరొక హీరో కూడా చనిపోతాడు అంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మీరే హీరోల జాతకాలు ,డేట్ అఫ్ బర్త్ చూసి చెక్ చేసుకోండి నేనైతే ఆ పేరు చెప్పలేను అంటూ కూడా వేణు స్వామి అన్నాడు.
అయితే మొత్తానికి 2026 లోపు టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు చనిపోవడం కన్ఫామ్ అని అందులో ఒకటి సూసైడ్ మరొకటి ఆరోగ్యపరమైన సమస్య అని వేణు స్వామి కుండబద్దలు కొట్టాడు. ప్రస్తుతం వేణు స్వామి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ హీరోలు ఎవ్వరూ? తెలుసుకోవడానికి నైటిజెన్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి వేణు స్వామి మాటలు ఈసారి కూడా నిజమవుతాయా లేదా తెలియాలి అంటే..కొన్నాళ్లు ఆగాల్సిందే.